Newsమెగాస్టార్ 156కు ఫిక్స్ చేసిన రెండు టైటిల్స్ ఇవే... డిఫ‌రెంట్‌గా ఉన్నాయే...!

మెగాస్టార్ 156కు ఫిక్స్ చేసిన రెండు టైటిల్స్ ఇవే… డిఫ‌రెంట్‌గా ఉన్నాయే…!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా యువ దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సోషియా ఫాంటసీ సినిమాపై టాలీవుడ్ ట్రేడ్ వర్గాలతో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మెగాస్టార్ కెరీర్ లో 156వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తుండగా.. చోటా కె నాయుడు ఫోటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు.

యూవీ క్రియేషన్స్ బ్యానర్ రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తోంది. మామూలుగా యూవీ క్రియేషన్స్ ప్రభాస్ సినిమాలపై భారీ బడ్జెట్ పెడుతూ ఉంటుంది. ఇప్పుడు చిరంజీవి లాంటి సీనియర్ హీరోతో రూ.200 కోట్ల భారీ బడ్జెట్తో సినిమా అంటే కచ్చితంగా.. ఇది సెన్సేషనల్ ప్రాజెక్ట్ అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుపై యూవీ క్రియేషన్స్ అధినేతలు వంశీ – ప్రమోద్ భారీ ఆశలు పెట్టుకున్నారు.

ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ ప్రతిష్టాత్మక మూవి అతి త్వరలోనే పట్టాలెక్కనుంది.
ఈ సినిమాలో మొత్తం ఐదుగురు హీరోయిన్లు ఉంటారన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఈ సినిమా టైటిల్ కు సంబంధించి మ‌రో ఆసక్తికరమైన వార్త బయటకు వినిపిస్తోంది. విశ్వంభర‌, ముల్లోకి వీరుడు అనే రెండు టైటిల్స్ ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నారట.

మరి ఈ రెండు టైటిల్స్ లో ఏదో ఒక టైటిల్ ఫైనల్ అవుతుందని కూడా తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఆ ఫస్ట్ లుక్‌లో పూలతో కప్పబడి ఉంది. ఆ పిక్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను 2025 సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేస్తారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news