News' డెవిల్ ' సినిమా ఫ్యాన్స్ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లేసిన క‌ళ్యాణ్‌రామ్‌......

‘ డెవిల్ ‘ సినిమా ఫ్యాన్స్ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లేసిన క‌ళ్యాణ్‌రామ్‌… ఇంత షాక్ ఇచ్చాడేంటి…!

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ గత ఏడాది బింబిసారా లాంటి సినిమాతో చాలా రోజుల తర్వాత సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. మల్లిడి వశిష్ట దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే తిరుగులేని హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాతోనే కళ్యాణ్ రామ్ తొలిసారిగా రూ.50 కోట్ల క్లబ్‌లోకి చేరాడు. బింబిసార హిట్ త‌ర్వాత ఈ యేడాది అమిగోస్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా అంచనాలు అందుకోలేదు.

ప్రస్తుతం కళ్యాణ్ రామ్ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా డెవిల్. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా నటిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాకి కథ, స్క్రీన్ పై, డైలాగులు శ్రీకాంత్ అందిస్తున్నారు. ఈ సినిమాను ముందుగా ఈనెల 24న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో రిలీజ్ చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు.

అక్టోబర్లో దసరా కానుకగా నందమూరి హీరో బాలయ్య భగవంత్‌ కేసరి సినిమాతో నందమూరి అభిమానులు మాత్రమే కాదు తెలుగు సినిమా అభిమానులు అందరూ పండగ చేసుకున్నారు. అదిరిపోయే హిట్ బాలకృష్ణకు దక్కింది. ఇప్పుడు అదే సెంటిమెంట్ నవంబర్‌లోను రిపీట్ చేస్తూ డెవిల్ సినిమాతో మరో సూపర్ హిట్ కొడతామని నందమూరి అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ ఆశలపై మేకర్స్ నీళ్లు చెల్లేశారు.

డెవిల్ సినిమాను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. పలు సాంకేతిక కారణాలు.. బ్యాగ్రౌండ్ స్కోర్ వల్ల సినిమా వాయిదా వేస్తున్నట్టు సమాచారం. త్వరలోనే మేకర్స్ సరికొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తామని చెప్పారు. సంయుక్తా మేడం హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వర సంగీతం అందిస్తున్నారు. డెవిల్ కచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది అన్న నమ్మకాలు అయితే ట్రేడ్ వర్గాల్లో ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news