Movies"నిన్న మొన్నటి వరకు ఆ హీరోతో తిరిగావ్.. ఇప్పుడు ఈ బకరా...

“నిన్న మొన్నటి వరకు ఆ హీరోతో తిరిగావ్.. ఇప్పుడు ఈ బకరా గాడా..?”..చరణ్ పై దారుణమైన ట్రోలింగ్..!

ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన పలు విషయాలను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు ఆకతాయిలు. మెగా ఫ్యామిలీ అన్న మాట వినపడితే చాలు డిస్ లైక్ కొట్టడాలు బూతు పదాలను వాడడాలు ఎక్కువగా చేస్తున్నారు . కాగా రీసెంట్గా మెగా డాటర్ నిహారిక శ్రీజను వరుణ్ తేజ్ పెళ్లిలో సింగిల్గా ఫొటోస్ దిగినందుకు ఏ రేంజ్ లో ఆడేసుకున్నారో మనం చూసాం . అయితే ఇప్పుడు తాజాగా మెగా హేటర్స్ రామ్ చరణ్ పై మండిపడుతున్నారు .

రామ్ చరణ్ తాజాగా ప్రైవేట్ ఈవెంట్లో పాల్గొన్నారు . అయితే రామ్ చరణ్ స్టార్ హీరో తో ఫొటోస్ దిగి సోషల్ మీడియాలో షేర్ చేశారు . దీనితో సోషల్ మీడియాలో ఆ ఫొటోస్ వైరల్ గా మారాయి . అయితే నిన్న మొన్నటి వరకు ఓ స్టార్ హీరో తో తిరిగి .. ఆయనను పూర్తిగా వాడేసుకొని ..ఇప్పుడు ఆయనను వదిలేసి మరో హీరోని పట్టుకున్నావా ..? అవసరానికి రంగులు మార్చే ఊసరవెల్లి నువ్వు అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు .

అంతేకాదు చరణ్ ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోతో అస్సలు మాట్లాడటం లేదు. ఆయన పుట్టినరోజుకి విష్ చేస్తున్నాడు తప్పిస్తే ఆయన సినిమాల విషయంలో కానీ ఆయన ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కానీ అసలు కనిపించడం లేదు . దీంతో అతగాడు నిన్న మొన్నటి వరకు ఫ్రెండ్షిప్ పేరుతో ఆయనని వాడుకున్నారని.. ఇప్పుడు ఆయనను వదిలేసి మరో డబ్బున్న క్రేజ్ ఉన్న పాపులారిటీ హీరోతో ఫొటోస్ దిగుతున్నాడు అని .. దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే మెగా ఫాన్స్ మాత్రం ఈ వార్తలను తిప్పి కొడుతున్నారు . సినిమా ఇండస్ట్రీ అన్నాక అందరితో కలుపుకుంటూ పోవాలి అని.. ఒక హీరోతో రాసుకొని పూసుకొని ఉంటే ఎలా ..? అంటూ చరణ్ కు సపోర్ట్ చేస్తున్నారు. మొత్తానికి చరణ్ ని బాగానే టార్గెట్ చేసి ఆడేసుకుంటున్నారు ఆకతాయిలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news