News' భ‌గ‌వంత్ కేస‌రి ' స‌క్సెస్ వాళ్ల‌దే... బాల‌య్య సంచ‌ల‌నం..!

‘ భ‌గ‌వంత్ కేస‌రి ‘ స‌క్సెస్ వాళ్ల‌దే… బాల‌య్య సంచ‌ల‌నం..!

న‌ట‌సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా.. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా, యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెర‌కెక్కిన‌ లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ భ‌గ‌వంత్ కేస‌రి ‘. బాలీవుడ్ సీనియర్ హీరో అర్జున్ రాంపాల్ విలన్గా, టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీ‌లీల కీల‌క‌ పాత్రలో నటించిన ఈ సినిమా దసరా కానుకగా గత నెల 19న ప్రాక్షకుల ముందుకు వచ్చి పెద్ద సక్సెస్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ.140 కోట్లకు పైగా గ్రాస్ వ‌సూళ్ళ‌తో పాటు రూ.70 కోట్ల షేర్ రాబట్టి బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ సినిమాగా నిలిచింది. థ‌మన్ ఈ సినిమాకు సంగీతం అందించారు.

తమ సినిమాను ఎంతో పెద్ద సక్సెస్ చేసిన ఆడియన్స్ కు.. అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పేందుకు గత రాత్రి హైదరాబాద్‌లో జేఆర్ సి కన్వెన్షన్ సెంటర్లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సక్సెస్‌మీట్‌కు ద‌ర్శ‌కేంద్రుడు కే రాఘవేంద్రరావు, అంబికా కృష్ణ ప్రత్యేక అతిధులుగా ఈ ఇవెంట్‌కు విచ్చేశారు. అయితే ఈ సక్సెస్‌మీట్ లో హీరో బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసింది అభిమానులు.. తెలుగు సినీ అభిమానుల అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకున్నారు.

అలాగే ఈ సినిమా క్రెడిట్ తాను లేదా దర్శకుడు అనిల్ రావిపూడికి, హీరోయిన్లకు ఇవ్వలేదు. సినిమాకు పని చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ తో, టెక్నీషియన్లు అందర్నీ కూడా సత్కరించాలని.. వారందరూ కూడా ఇంత పెద్ద సక్సెస్ కోసం ప్రాణం పెట్టి పనిచేశారని బాలయ్య మెచ్చుకున్నారు. అలాగే దర్శకుడు, హీరోలు, సంగీత దర్శకుడు, ఫైట్ మాస్టర్లకు, హీరోయిన్లకు, విలన్ అర్జున్ రాంపాల్‌ వరకు బాలయ్య ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇక ‘ భ‌గ‌వంత్ కేస‌రి ‘ నాలుగో వారంలోకి అడుగుపెట్టిన కూడా పలు ప్రాంతాల్లో ఇంకా స్టడీగానే కలెక్షన్లు రాబడుతుంది.

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news