Moviesవెంక‌టేష్‌లో ఎప్పుడూ చూడ‌ని స‌రికొత్త యాక్ష‌న్‌... చాలా కొత్త‌గా ' సైంధ‌వ్...

వెంక‌టేష్‌లో ఎప్పుడూ చూడ‌ని స‌రికొత్త యాక్ష‌న్‌… చాలా కొత్త‌గా ‘ సైంధ‌వ్ ‘ టీజ‌ర్ ( వీడియో)

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో, విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ సైంధవ్. తెలుగు సినీ ప్రేక్ష‌కులు అంద‌రూ ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తోన్న ఈ సినిమా టీజ‌ర్ ఈ రోజు రిలీజ్ అయ్యింది. అస‌లు ఈ టీజ‌ర్ చూస్తుంటే మ‌రోసారి.. మ‌రోసారి చూడాల‌నిపించేలా ఉంది.

ప్రేక్ష‌కుల నుంచి సైంధ‌వ్ టీజ‌ర్‌కు యునాన‌మ‌స్‌గా మంచి టాక్ వ‌చ్చేసింది. ఈ టీజ‌ర్‌లోనే చాలా ట్విస్టులు కూడా చూపించారు. డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్ల‌తో మెప్పించే బాలీవుడ్ న‌టుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ఈ సినిమాలో ఓ నెగెటివ్ క్యారెక్టర్‌లో క‌నిపిస్తున్నాడ‌న్న విష‌యం ట్రైల‌ర్‌తో రివీల్ అయ్యింది. మ‌రో విశేషం ఏంటంటే నవాజుద్దీన్ సిద్ధిఖీ తెలుగులో తన పాత్రకు స్వ‌యంగా డబ్బింగ్ చెప్పడం.. అది తెలుగు నేటివిటికి ప‌ర్‌ఫెక్ట్‌గా మ్యాచ్ అవ్వ‌డం విశేషం.

ఇక టీజ‌ర్ మొద‌లైన చాలా సేప‌టి వ‌ర‌కు వెంకీ ఎంట్రీ లేదు. చివ‌ర్లో ఎంట్రీ ఇచ్చిన వెంకీ అదిరిపోయే యాక్ష‌న్‌తో అద‌ర గొట్టేశాడు. వెంకీ త‌న ప్ర‌త్య‌ర్థుల‌ను చాలా ముప్పుతిప్ప‌లు పెడ‌తాడ‌ని టీజ‌ర్ చెప్ప‌క‌నే చెప్పేసింది. ఇక ఈ సినిమాలో ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెర్మియా, సారా మరియు జయప్రకాష్‌లు కీల‌క‌ పాత్రల్లో నటిస్తున్నారు.

నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి సైంధవ్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కి కాలా ఫేం సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండ‌గా… సంక్రాంతి కానుక‌గా జనవరి 13, 2024న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news