Movies' స‌ల్మాన్ టైగ‌ర్ 3 ' ట్రైల‌ర్ వ‌చ్చేసింది... బాక్సాఫీస్ విధ్వంసం.....

‘ స‌ల్మాన్ టైగ‌ర్ 3 ‘ ట్రైల‌ర్ వ‌చ్చేసింది… బాక్సాఫీస్ విధ్వంసం.. దుమ్ములేపిన క‌త్రినా ( వీడియో)

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ – కత్రినా కైఫ్ జంట ఇప్పటికే రెండు సినిమాలతో ప్రేక్షకులను మెప్పించి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు కొల్లగొట్టారు. ఈ సినిమాల్లో టైగర్ గా సల్మాన్ సాహసాలు.. జోయాగా కత్రినా గ్లామర్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాయి. ఇక ఇప్పుడు టైగ‌ర్ 3 మూవీ. తో ఈ జంట ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే టైగర్ 3 మూవీ ట్రైలర్ మేకర్స్ రిలీజ్ చేశారు.

ఈ సీక్వెల్ సినిమాకు మనీష్ శర్మ దర్శకుడు. యస్ రాజ్ ఫిలిం సమర్పణలో రానున్న ఈ సినిమాకు ఆదిత్య చోప్రా నిర్మాత. ట్రైలర్ చూస్తుంటే ఇదొక ప్రతీకార యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. టైగర్ తన శత్రువులను వేటాడేందుకు ప్రాణాలను సైతం రిస్కు చేసి ఎలాంటి మిషన్ ? కొనసాగించాడు అన్నదే ఈ సినిమా కథాంశం. సల్మాన్ ఖాన్ సీక్రెట్ ఇండియన్ రా ఏజెంట్ అని.. అతడు తన దేశాన్ని, ఫ్యామిలీని కాపాడుకోవడానికి పోరాటం చేస్తున్నట్టుగా ట్రైలర్లో చూపించారు.

అలాగే ఈ ట్రైల‌ర్ సీనియ‌ర్ న‌టి రేవ‌తి పాత్ర‌తో మొద‌ల‌వుతుంది. దేశాన్ని, ఫ్యామిలీని కాపాడుకోవ‌డంతో పాటు అదే సమయంలో టైగ‌ర్‌ ఉగ్రవాదులకు సాయం చేసినట్టు ప్రచారం జరగడంతో తన నిజాయితీని ఎలా ప్రూవ్ చేసుకున్నాడో అన్నదే ? ఈ సినిమా ప్రధానంశంగా తెలుస్తోంది. ట్రైలర్లో దర్శకుడు ఫుల్ యాక్షన్ సీన్లు చూపించాడు.

ఇందులో కత్రినా కైఫ్ కూడా భారీ యాక్షన్ సీన్లలో అదరగొట్టేసింది. క‌త్రినాకు కూడా భారీ యాక్ష‌న్ సీన్లు పెట్టిన‌ట్టు ట్రైల‌ర్లో చూపించేశారు. వంటిమీద ఏం లేకుండా మ‌రో లేడీ విల‌న్‌తో క‌త్రినా చేసిన ఫైట్ కూడా ఉంటుంద‌ని.. ఈ ట్రైల‌ర్లో చిన్న క‌ట్ చూపించారు. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తుండటం విశేషం. పాకిస్తాన్ ఉగ్ర‌వాదానికి, ఇండియా రా ఏజెంట్‌కు మ‌ధ్య లింకులు.. ఉగ్ర‌వాదుల‌ను ఎదుర్కోవడం ఇవ‌న్నీ సినిమాలో ఉండ‌నున్నాయి. నవంబర్ 12న దీవాలి కనుక టైగర్ 3 ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news