Newsనాని సినిమాల‌కు నిజంగానే లాభాలు రావ‌ట్లేదా... నాని ఈ మిస్టేక్ క‌రెక్ష‌న్...

నాని సినిమాల‌కు నిజంగానే లాభాలు రావ‌ట్లేదా… నాని ఈ మిస్టేక్ క‌రెక్ష‌న్ చేయ‌క‌పోతే కెరీర్ ఖ‌తం..!

నాని న‌టించిన హాయ్ నాన్న సినిమా డిసెంబ‌ర్ తొలి వారంలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి వ‌చ్చిన టీజ‌ర్ అయితే అంద‌రిని ఆక‌ట్టుకుంటోంది. ఇదిలా ఉంటే నాని వ‌రుస‌గా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. అయితే నాని సినిమాల‌కు అనుకున్న స్థాయిలో లాభాలు రావ‌డం లేదు. సినిమాలు బాగున్నాయ‌న్న టాక్ వ‌స్తున్నా కొన్న బ‌య్య‌ర్ల‌తో పాటు ఎగ్జిబిట‌ర్ల‌కు ఎందుకు లాభాలు రావ‌డం లేద‌న్న‌దే పెద్ద ప్ర‌శ్న‌.

ఇదే ప్ర‌శ్న తాజాగా నిన్న నానికి ప్రెస్‌మీట్లో ఎదుర‌వ్వ‌డం.. దానిని నాని కౌంట‌ర్ ఇవ్వ‌డం.. ఆ త‌ర్వాత నానితో సినిమాలు తీసిన నిర్మాత‌లు తాము నానితో చేసిన సినిమాలకు లాభాలు వ‌చ్చాయంటూ ట్వీట్లు చేయ‌డం జ‌రిగాయి. ఇవ‌న్నీ ప‌క్కా ప్లానింగ్‌తో.. నానిని సేవ్ చేయ‌డానికే జ‌రిగాయ‌న్న‌ది తెలిసిన స‌త్యం. నాని సినిమాల విష‌యంలో ప్ర‌ధానంగా కొన్ని లోపాలు జ‌రుగుతున్నాయి. ఇక్క‌డ నానిని త‌ప్పుప‌ట్ట‌డం లేదు.

నాని ఎంచుకునే క‌థ‌లు ఒక స్థాయి వ‌ర‌కే ప్రేక్ష‌కుల‌కు రీచ్ అవుతున్నాయి. ఎంసీఏ లాంటి బ్లాక్బస్టర్ తర్వాత హీరోగా నాని నుంచి వరుసగా వచ్చిన సినిమాలు చూస్తే కృష్ణార్జున యుద్ధం – నిన్ను కోరి – దేవదాస్ – జెర్సీ – వి – గ్యాంగ్ లీడర్ – ట‌క్ జగదీష్ – శ్యాం సింగరాయ్ – అంటే సుందరానికి – దసరా వీటిలో కృష్ణార్జున యుద్ధం, దేవదాస్, వి, గ్యాంగ్ లీడర్, అంటే సుందరానికి సినిమాల పరిస్థితి తెలిసిందే. నిన్ను కోరి సూపర్ హిట్. ట‌క్‌ జగదీష్ ఓటిటిలోకి వెళ్లి ప్లాప్ అయ్యింది. జెర్సీ, శ్యాం సింగరాయ్‌, దసరా ఈ 3 మంచి సినిమాలు. అందులో ఎలాంటి డౌట్ లేదు.

జెర్సీకి లాభాలు వచ్చాయన్నారు కొంతమంది బయ్యర్లకు డబ్బులు వెనక్కు ఇవ్వాల్సి వచ్చిందన్నది ట్రేడ్ వర్గాల్లో వినిపించిన మాట. శ్యాం సింగర్ సినిమాగా నిర్మాతకు మంచి పేరు వచ్చింది.. కానీ లాభాలు రాలేదు అన్నది వాస్తవం. దసరా సినిమా వ‌సూళ్లు రు. 100 కోట్లు అన్నారు.. ఆంధ్రలో కొందరు నష్టపోయారు.. సీడెడ్‌లో ఎక్కువ నష్టాలు వచ్చాయి. ఇప్పుడు నాని తన సినిమాలకు ఎంత లాభాలు వచ్చాయని ప్రకటించుకుంటున్నా నాని చేస్తున్న కొన్ని లోపాల వల్ల నాని సినిమాలకు నష్టాలు తప్పడం లేదు.

దసరా, శ్యాం సింగరాయ సినిమాలను బడ్జెట్ కంట్రోల్లో తీసి ఉంటే నిర్మాతలు.. బయ్యర్లు అందరూ లాభాలు బాట ప‌ట్టి ఉండేవారు. నాని సినిమాలకు బడ్జెట్ బాగా పెరిగిపోతోంది.. జెర్సీ సినిమా టైమ్ కు నాని రెమ్యునరేషన్ రు. 9 కోట్లు.. అప్పట్లో నాని సినిమా ఖర్చు 30 కోట్ల లోపల పూర్తయ్యేది. దసరా సినిమా ఖర్చు 70 కోట్లకు చేరుకుంది. ఇప్పుడు హాయ్ నాన్న సినిమాకు నాని రెమ్యునరేష్ 22 కోట్లు అని అంటున్నారు. నాని రెమ్యూనరేషన్ పెరిగిపోవడం.. కాస్ట్ కంట్రోల్ అదుపు తప్పడం ఇవన్నీ నాని సినిమాలకు భారంగా మారాయి.

ఇక నాని సినిమాలు ఎంచుకునే కథలు కూడా ఒక రేంజ్ వరకు రీచ్ అవుతున్నాయి. నాని సినిమాలకు రిపీటెడ్ ఆడియన్స్ వచ్చే పరిస్థితులు లేవు. ఇవన్నీ నాని దృష్టిలో పెట్టుకొని రెమ్యూనరేషన్ కాస్త కంట్రోల్లో పెట్టుకోవడం.. బడ్జెట్ కంట్రోలింగ్ చేయటం చేస్తే నానికి తిరిగి ఉండదు. అలా కాకుండా నాని కూడా సినిమా సినిమాకు రెమ్యూనరేషన్ పెంచుకుంటూ పోతుంటే మనోడి సినిమాలకి ఎప్పటికీ లాభాలు వచ్చే పరిస్థితి ఉండదన్నది వాస్తవం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news