Newsపాపం కృతిశెట్టిని ఆదుకుంటోన్న ఒకే ఒక్క హీరో... ఎవ‌రా స్టార్ ...!

పాపం కృతిశెట్టిని ఆదుకుంటోన్న ఒకే ఒక్క హీరో… ఎవ‌రా స్టార్ …!

శాండ‌ల్ వుడ్ నుంచి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లలో కృతి శెట్టి ఒకరు. తెలుగులో మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ తొలి సినిమా ఉప్పెన‌తో పాటు ఆ త‌ర్వాత‌ రెండు మూడు సినిమాలలో విజయాల బాటలో పయనించింది. ఆ తర్వాత వరుస ప్లాపులతో చ‌తికిల‌పడింది. ఈ వారియర్ సినిమాతో కోలీవుడ్‌కు కోటీ ఆశలతో ఎంటర్ అయింది. అయితే ఆమె లెక్క ఇక్కడ పని చేయలేదు. ఆ సినిమాయే కాదు.. ఆ తర్వాత తెలుగులో విడుదలైన నాగచైతనే కస్టడీ కూడా నిరాశపరిచింది.

ఇక నేరుగా బాలా దర్శకత్వంలో స్టార్ హీరో సూర్యకు జంటగా ఓ సినిమాలో నటించే అదృష్టం దక్కించుకుంది. అయితే ఇంతలోనే ఆ సినిమా నుంచి ఆమెను తప్పించేశారు. ఇటు తెలుగులోనూ ఆమె న‌టించిన అన్ని సినిమాలు ప్లాప్‌లు అవ్వ‌డంతో చివరకు కృతి శెట్టి ఐరన్‌లెగ్‌ అయిపోయింది. ఆమెను ఎవరు దగ్గరకు కూడా రానిచ్చే పరిస్థితి లేదు.

అలాంటి టైంలో తమిళ హీరో కార్తీతో జతగా ఒక సినిమాలో అవకాశం వచ్చింది. ఈ సినిమాను స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఎన్‌. కుమారస్వామి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కార్తీక్ కెరీర్లో భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమాలో కార్తీక్ ఎంజీఆర్ వీరాభిమానిగా నటిస్తున్నట్టు సమాచారం.

ఇప్పటికే 50% షూటింగ్ కూడా పూర్తయింది. ఇది ఇలా ఉంటే అసలు కృతికి ఐరెన్‌లెగ్ ముద్ర‌ప‌డిపోవ‌డంతో ఏ హీరో కూడా ఆమెను దగ్గరకు రానిచ్చే పరిస్తితి లేదు. అలాంటి టైంలో కార్తీ ఈ అమ్మడికి లక్కీ ఛాన్స్ ఇచ్చాడు. మరి ఈ సినిమాతో అయినా కృతి సక్సెస్ ట్రాక్ లోకి వస్తుందేమో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news