Moviesఎవ‌డో ఒక లం... కొడుకు.. ' లియో ' ట్రైల‌ర్‌లో విజ‌య్...

ఎవ‌డో ఒక లం… కొడుకు.. ‘ లియో ‘ ట్రైల‌ర్‌లో విజ‌య్ ఇచ్చిన ట్విస్ట్‌కు ఆన్స‌ర్ ఇదే ( వీడియో)

తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ లియో. లోకేష్ కనగ‌రాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తూ ఉన్నారు. ఎట్టకేలకు భారీ అంచనాల మధ్య గురువారం సాయంత్రం ట్రైలర్ రానే వచ్చింది తెలుగు ట్రైలర్ చూస్తుంటే ప్రతి సీన్ మాత మోగిపోయేలా ఉంది. ట్రైలర్ మొత్తం యాక్షన్ కట్స్ తో నింపేశాడు లోకేష్.

ఒక్క‌ క్యారెక్టర్ ని కూడా మిస్ చేయకుండా ట్రైలర్లో చూపించాడు. ఎవరి క్యారెక్టర్ ఎలా ఉందో ? క్లారిటీ ఇచ్చేశాడు. ముఖ్యంగా విజయ్ యాక్షన్స్ స‌న్నివేశాలు చూస్తుంటే నరాలు తెగేలా ఉన్నాయంటున్నారు యాక్షన్ లవర్స్. గత ఏడాది కమలహాసన్‌తో విక్రమ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తెరకెక్కించిన లోకేష్ కనగ‌రాజ్‌ కచ్చితంగా ఈ సినిమాతో మరో సెన్సేషనల్ క్రియేట్ చేయబోతున్నాడు అన్న అంచనాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి.

గతంలో విజయ్ – లోకేష్ కాంబినేషన్లో వచ్చిన మాస్టర్ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఇక తాజా ట్రైలర్ విషయానికి వస్తే సీనియర్ హీరో అర్జున్ – బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ – దర్శకుడు గౌతమ్ మీనన్ – హీరోయిన్ త్రిష లుక్స్ ఆకట్టుకున్నాయి. అనిరుధ్‌ అందించిన బీజీయంతో పాటు మనోజ్ పరమహంస ఫోటోగ్రఫీ అమేజింగ్ గా ఉంది.

యాక్షన్ చింపేసింది. మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే సినిమా బ్లాక్ బస్టర్ అవటం పక్కా అనిపిస్తుంది. ట్రైలర్లో విజయ్ హైనాతో చేసే ఫైట్ ఒక రేంజ్ లో ఉంటుందన్న హింట్ ట్రైలర్లో ఇచ్చేశాడు. ఇక ఎవడో ఒక లం… కొడుకు నాలా ఉన్నాడని ప్రతి ఒక్కడు నా ప్రాణం తీస్తే నన్నేం చేయమంటావే ? అనే విజయ్ డైలాగ్ బట్టి చూస్తే ఈ సినిమాలో విజ‌య్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడని తెలుస్తోంది. అయితే రెండో విజ‌య్ రోల్ విల‌న్‌దా.. లేదా ట్విస్ట్ ఉంటుందా ? అన్న‌ది స‌స్పెన్స్‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news