Newsబ్రేకింగ్‌: బాల‌య్య అన్‌స్టాప‌బుల్ 3.. ఈ రోజు నుంచే మొద‌లు...

బ్రేకింగ్‌: బాల‌య్య అన్‌స్టాప‌బుల్ 3.. ఈ రోజు నుంచే మొద‌లు…

నందమూరి నటసింహం బాలకృష్ణ ఇటు సినిమాలు.. అటు రాజకీయాలతో పాటు మధ్యలో బుల్లితెరపై కూడా తళుక్కున మెరుస్తున్నారు. సినిమాలపరంగా బాలయ్య నటించిన అఖండ – వీరసింహారెడ్డి రెండు సూపర్ డూపర్ హిట్. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటించిన భగవంత్‌ కేసరి సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న థియేటర్లలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న బాలయ్య అటు రాజకీయాల్లోనూ బిజీబిజీగా ఉన్నారు.

ఇక ఇప్పుడు తనకు కలిసి వచ్చిన బుల్లితెర షో అన్‌స్టాప‌బుల్‌కు రెడీ అవుతున్నారు. ఆహా ఓటీటీలో ఇప్పటికే స్ట్రీమింగ్ అయినా అన్‌స్టాపుబుల్ రెండు సీజన్లు అందర్నీ ఆకట్టుకుని మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. ఇక తాజా సమాచారం ప్రకారం అన్‌స్టాప‌బుల్ 3కు ముహూర్తం రెడీ అయింది. శుక్రవారం బాలయ్య అనుస్టాప‌బుల్‌ సీజన్ 3కి అఫీషియల్ గా సైన్ చేస్తారని అంటున్నారు. అతి త్వరలోనే సీజన్ 3 లో ఫస్ట్ ఎపిసోడ్ ఒక ప్రముఖ టాలీవుడ్ సెలబ్రిటీతో గ్రాండ్ గా షూట్ చేయనున్నారని టాక్.

ఫస్ట్ ఎపిసోడ్‌ను రానున్న దసరా పండుగ కానుకగా టెలీకాస్ట్ చేసేందుకు ఆహా యజమాన్యం శరవేగంగా ఏర్పాట్లు చేస్తుంది. దీనిపై ఆహా టీం నుంచి అధికారిక ప్రకటన కూడా రానున్నట్టు తెలుస్తోంది. వాస్తవంగా చెప్పాలంటే తొలి సీజన్ దుమ్ము రేపేసింది. రెండో సీజన్కు వచ్చేసరికి బాలయ్య వైపు నుంచి తప్పు లేకపోయినా సరైన కంటెస్టెంట్లు దొరకలేదు.

దీంతో తొలి సీజ‌న్‌తో పోలిస్తే రెండో సీజన్ గ్రాఫ్ కాస్త తగ్గింది. అయితే ఇప్పుడు మూడో సీజన్లో టాప్ సెల‌బ్రిటీల‌ను షోకు తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాలీవుడ్ నుంచి కూడా ఒకరిద్దరూ హీరోయిన్లు కూడా ఈసారి సీజన్ 3 కి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తారని తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news