Moviesవీడియో మొత్తం ముద్దులే... ర‌ష్మిక తెగ నాకేసిందిగా... ( వీడియో)

వీడియో మొత్తం ముద్దులే… ర‌ష్మిక తెగ నాకేసిందిగా… ( వీడియో)

బాలీవుడ్ టాలెంటెడ్, క్రేజీ సూపర్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా తెర‌కెక్కుతోన్న సినిమా యానిమ‌ల్‌. కేవ‌లం అర్జున్‌రెడ్డి, క‌బీర్‌సింగ్ సినిమాల‌తో ఇటు సౌత్ టు అటు నార్త్ వ‌ర‌కు సూప‌ర్ పాపుల‌ర్ అయిన మ‌న టాలీవుడ్ ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన ఈ సాలిడ్ యాక్షన్ అండ్ లవ్ డ్రామాపై దేశ‌వ్యాప్తంగా భారీ అంచ‌నాలు ఉన్నాయి.

బాలీవుడ్ స‌హా పాన్ ఇండియా రేంజ్లో యానిమ‌ల్ సినిమాపై చాలా అంచ‌నాలే ఉన్నాయి. ఇక ఈ సినిమా నుంచి మేక‌ర్స్ సాలిడ్ ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు పాన్ ఇండియా భాష‌ల్లో రిలీజ్ అయిన ఈ సాంగ్ తెలుగు వెర్ష‌న్ విన‌డానికి డీసెంట్‌గా ఉన్నా విజువ‌ల్స్ ప‌రంగా కంప్లీట్‌గా సందీప్ వంగ మార్క్‌తో కనిపిస్తోంది.

ఇక సాంగ్‌లో మెయిన్‌గా హీరో, హీరోయిన్ల పెళ్లికి ఇంట్లో వాళ్లు నిరాక‌రించ‌డం… వాళ్ల ముందే ర‌ష్మిక‌, ర‌ణ‌బీర్‌ డీసెంట్‌గా మూతిముద్దులు పెట్టేసుకోవ‌డం.. ఇంట్లో వాళ్లు షాక్ అయిపోవ‌డం… అక్క‌డ ఉన్న పిల్ల‌ల‌ను ఆ సీన్ చూడ‌కుండా చేతులు అడ్డుపెట్టే ప్ర‌య‌త్నం చేస్తుంటే.. పిల్ల‌లు ఆ సీన్‌ను ఆశ్చ‌ర్యంగా చూస్తూ ఉండిపోవ‌డం.. ఇదంతా సందీప్ వంగ మార్క్ సీన్లే అని చెప్పాలి.

అక్క‌డ నుంచి మొద‌లైన ముద్దుల ప‌ర్వం… విమాన‌ప్ర‌యాణం లోనూ.. ఆ త‌ర్వాత కేథార్‌నాథ్‌లో పెళ్లి చేసుకుని ఒక్క‌ట‌వ్వ‌డం… అందులో కూడా ప్రేమ‌తో కూడిన రొమాన్స్‌.. ఓవ‌రాల్‌గా ర‌ష్మిక అయితే ప‌దే ప‌దే ర‌ణ‌బీర్‌తో పెదాలు క‌లిపేసి ఇష్టం వ‌చ్చిన‌ట్టు రెచ్చిపోయింది. అస‌లు ఈ ముద్ద‌లు ఒక‌టి రెండు కాదు.. లెక్క పెట్టలేన‌ట్టుగా ఉన్న‌ట్లున్నాయి. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 1న విడుదల కాబోతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news