Moviesయూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న ' భ‌గ‌వంత్ కేస‌రి ' ట్రైల‌ర్‌... బాల‌య్య...

యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న ‘ భ‌గ‌వంత్ కేస‌రి ‘ ట్రైల‌ర్‌… బాల‌య్య వీరంగం..!

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా సూపర్ డూపర్ హిట్ సినిమాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ భగవంత్‌ కేసరి. బాలయ్యకు జోడిగా తొలిసారిగా సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తుండగా… క్రేజీ హీరోయిన్ శ్రీలీల బాలయ్య కూతురు పాత్రలో కనిపిస్తోంది. ఈ కాంబినేషన్ అంతా కూడా క్రేజీ కాంబినేషన్.

బాలయ్య సినిమాలో కాజల్, శ్రీలీల నటిస్తుండటం ఇదే తొలిసారి. ఇటు అనిల్ రావిపూడి – బాలయ్య కాంబినేషన్ అంటేనే చాలా ఆసక్తిగా ఉంది. దసరా కానుకగా ఈనెల 19 థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఆదివారం వరంగల్ లో గ్రాండ్గా నిర్వహించారు. మాస్ ఆడియన్స్‌కు ట్రైలర్ మంచి కిక్‌ ఇచ్చింది. భగవంత్ కేసరి ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్లో టాప్ లో ట్రెండ్ అవుతుంది.

5.5 మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది. ప్ర‌స్తుతం ఇది టాప్ రేంజ్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించ‌గా ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ రు.110 కోట్ల రేంజ్‌లో జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news