Newsమ‌హేష్ సినిమా కోసం రాజ‌మౌళి మైండ్ బ్లోయింగ్ మార్కెటింగ్ స్ట్రాట‌జీ..!

మ‌హేష్ సినిమా కోసం రాజ‌మౌళి మైండ్ బ్లోయింగ్ మార్కెటింగ్ స్ట్రాట‌జీ..!

ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మంత్రి కు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమా తర్వాత మహేష్ బాబు దర్శకతీయుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి సినిమాలో నటించిన ఉన్నాడు రాజమౌళి మహేష్ బాబు సినిమా కోసం టాలీవుడ్ సినీ జనాలు అందరూ రెండు దశాబ్దాలుగా కళ్ళు కాయలు కాల్చేలా ఎదురుచూస్తున్నారు ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన సింహాద్రి సినిమా సూపర్ హిట్ అయినప్పటి నుంచి మహేష్ బాబు – రాజమౌళి సినిమా కోసం జనాలు ఎదురు చూస్తూనే ఉన్నారు.

ఈ క్రమంలోనే రెండు దశాబ్దాలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఎట్టకేలకు దుర్గా ఆర్ట్స్‌ అధినేత కేఎల్ నారాయణ బ్యాన‌ర్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా గురించి వస్తున్న ప్రతి వార్త ఎంతో ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం రాజమౌళి కూడా ఈ క్రేజీ ప్రాజెక్టు ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీ బిజీగా ఉన్నారు. అలాగే ఈ సినిమా కోసం ఇప్పటికి లొకేషన్స్ వెతికే పనిలో రాజమౌళి అండ్ టీం బిజీగా ఉంది. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఓ అడ్వెంచర్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రాంచైజీగా కూడా మలిచే ఆలోచనలో రాజమౌళి ఉన్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా మార్కెట్ స్ట్రాటజీ కోసం రాజమౌళి అదిరిపోయే స్కెచ్ లు వేస్తున్నట్టు తెలుస్తోంది. అడవుల్లో మహేష్ బాబుని గైడ్ చేసే ఒక పాత్ర ఉంటుంది అట. ఈ పాత్ర కోసం బాలీవుడ్‌కు చెందిన ఒక స్టార్ హీరోని ఈ సినిమాలో తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే మహేష్ బాబుకి సినిమా మొత్తం ఉండే ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం తమిళ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు కీలక నటుల పేర్లు ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

పాన్ వరల్డ్ సినిమా కాబట్టి పాన్ ఇండియా రేంజ్ లో నటీనటులను.. హాలీవుడ్ నటులను కూడా ఒకరిద్దరిని తీసుకొని పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ సినిమాను తెర‌కెక్కించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఆర్ఆర్ సినిమాలో కూడా హాలీవుడ్ నటులు పరిచయం చేసిన రాజమౌళి ఇప్పుడు మహేష్ సినిమా మార్కెట్ స్ట్రాటజీ కోసం ఏ రేంజ్ లో స్కెచ్ లు ? వేస్తున్నాడో తెలుస్తోంది. ఇక ఈ సినిమా నిర్మాణ వ్యయం రు. 800 నుంచి 1000 కోట్ల రేంజ్ లో ఉండబోతుందని కూడా తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news