News' వార్ 2 ' లో ఎన్టీఆర్ పాత్ర‌పై ఆ వార్త‌లు...

‘ వార్ 2 ‘ లో ఎన్టీఆర్ పాత్ర‌పై ఆ వార్త‌లు ప‌చ్చి ఫేక్‌… అస‌లు నిజం ఇదే…!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో రు. 300 కోట్ల తో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పార్ట్ 1, పార్ట్ 2 గా రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని దర్శకుడు కొరటాల శివ అధికారికంగా ప్రకటించారు. దేవర 1 వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న థియేటర్లలోకి వస్తోంది. ఎన్టీఆర్ కి జోడిగా బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా బాలీవుడ్ సీనియర్ నటుడు సైఫ్ అలీ ఖాన్ క్రూరమైన విలన్ గా కనిపించనున్నాడు.

అలాగే ఈ సినిమాలో మరో బాలీవుడ్ హీరో కూడా కీలకపాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. దేవర సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఎన్టీఆర్ ప్రశాంత్ నిల్ సినిమా షూటింగ్లో జాయిన్ అవుతాడు. ఈ లోగా ప్ర‌శాంత్ నీల్ ప్ర‌భాస్ స‌లార్ సినిమాను ఫినిష్ చేసి ఎన్టీఆర్ సినిమా వ‌ర్క్ స్టార్ట్ చేస్తారు. అయితే అంతకంటే ముందు రెండు నెలల పాటు కంటిన్యూగా వార్ -2 సినిమాకు డేట్లు ఇచ్చిన సంగతి తెలిసిందే.

బాలీవుడ్ స్టార్ హీరో కండల‌ వీరుడు హృతిక్ రోషన్ హీరోగా.. ఎన్టీఆర్ నెగటివ్ పాత్రలో తెరకెక్కుతున్న వార్ -2 సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు సంబంధించి ఒక వార్త గత వారం రోజులుగా బయటకు వచ్చింది. ఎన్టీఆర్ పాత్రకి డూప్‌తో కొన్ని సీన్లు షూట్ చేశారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే అది నిజం కాదని కేవలం రెండు రోజులు మాత్రమే ట్రైల్‌ సూట్ నిర్వహించారని తెలుస్తోంది.

ఇంకా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాలేదని.. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ వార్ -2 షూటింగ్లో జాయిన్ అవ్వటానికి ముందే హృతిక్ రోషన్ మీద కొన్ని సీన్లు షూట్ చేస్తునరని తెలుస్తోంది. ఆయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను యాష్ రాజ్ ఫిలిమ్స్ తమ స్పై సీరిస్‌లో భాగంగా తెరకెక్కిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news