Newsస్టార్ హీరోయిన్ అవ్వాల్సిన మెహ్రీన్ కెరీర్ నాశ‌నం చేసిందెవ‌రు... ఎంత‌కు దిగ‌జారిందంటే..!

స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన మెహ్రీన్ కెరీర్ నాశ‌నం చేసిందెవ‌రు… ఎంత‌కు దిగ‌జారిందంటే..!

నాని హీరోగా వచ్చిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది మెహరీన్ కౌర్. ఆ సినిమాతో యూత్ ఆడియన్స్ కి బాగా దగ్గరయింది. వరుస సినిమాలు చేస్తూ అలరించినా ఈ అమ్మడు కచ్చితంగా స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ అనుకున్నారు. మెహరీన్ కు కావలసిన అందంతో పాటు నటన కూడా ఉండడంతో కచ్చితంగా ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు లాంటి క్రేజీ హీరోల‌ సరసన ఆమెకు ఛాన్సులు వస్తాయని అందరూ అనుకున్నారు.

అయితే ఈ అమ్మ‌డి కెరీర్ పై ఎంగేజ్మెంట్ ఎఫెక్ట్ బాగా పడింది. హర్యానాకు చెందిన పొలిటీషియన్ భవ్య భిష్ణోయ్‌తో ఎంగేజ్మెంట్ జరుపుకున్న మెహ్రిన్ అనువార్య కారణాలతో పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. ఈ ఎఫెక్ట్ మెహ్రిన్ కెరీర్ మీద బాగా పడింది. కారణం ఏదైనా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యాక మెహరీన్ కు ఎవరు ? ఛాన్సులు ఇచ్చేందుకు ముందుకు రాలేదు. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3 సినిమాలో నటించినా ఆ సినిమా ఆమె కెరీర్ కు పెద్దగా ఉపయోగపడలేదు.

మధ్యలో చేసిన మంచి రోజులు వచ్చాయి సినిమా కూడా కలిసి రాలేదు. మారుతి – ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న రాజా డీలక్స్ సినిమాలో ప్రభాస్ పక్కన మెహ్రీన్‌ నటిస్తుందని ప్రచారం జరిగినా ఆమెకు ఛాన్స్ ఇచ్చేందుకు మారుతి ఒప్పుకోలేదు. ప్రస్తుతం మెహరీన్ పరిస్థితి ఎంతకు పడిపోయింది అంటే ఆమె కొత్త హీరో విక్రాంత్‌రెడ్డితో కలిసి నటిస్తోంది.

స్పార్క్ అంటూ రాబోతున్న ఈ సినిమాలో విక్రాంత్ రెడ్డి నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు అత‌డే హీరో, దర్శకుడు. స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలగాల్సిన మెహ్రిన్ చివరకు ఊరు పేరు లేని కొత్త హీరోకి జోడిగా నటిస్తూ ఈ సినిమాపై ఆశలు పెట్టుకుంది. ఏది ఏమైనా కెరీర్ పరంగా ఫామ్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలంటూ ఆమె తీసుకున్న నిర్ణయం ఆమె కెరీర్ ని పాతాళంలో పడగొట్టేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news