Newsపెళ్లి న‌టుడు పృథ్వి జీవితంలో గుండెలు పిండేసే బాధ‌... రెండో భార్య...

పెళ్లి న‌టుడు పృథ్వి జీవితంలో గుండెలు పిండేసే బాధ‌… రెండో భార్య ఎవ‌రు…!

సీనియర్ నటుడు పృథ్విరాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. బాలనటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. వడ్డే నవీన్ హీరోగా వచ్చిన పెళ్లి సినిమాతో పృథ్వి పాత్ర తెలుగు నాట ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. కొంతకాలం సినిమాలకు దూరమైన పృథ్వీరాజ్ ప్రస్తుతం బుల్లితెరపై నటిస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన రెండో పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

పృథ్వి తనకంటే వయసులో చాలా చిన్నదైన షీత‌ల్‌ను రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. లైఫ్ అనేది అందరికీ ఒకేలా ఉండదు.. నా మొదటి భార్య బీనా – నేను ఎంతో బెస్ట్ ఫ్రెండ్స్. అయితే ఆమె నా భార్య అయిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మా ఇద్దరికీ వాదోపవాదాలకు జరిగేవి. నా కుమారుడికి ఆటిజం ఉంది. కొడుకుతో నేను ఎక్కువ సమయం కేటాయించేవాడిని.. నాతో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటాడు.. నన్ను బాగా అర్థం చేసుకునేవాడని తెలిపాడు.

నేను ప్రెస్టేషన్ ఉన్నప్పుడు నా కొడుకుని ఒక్కసారి చూస్తే దేవుడు నాకు ఇలాంటి కొడుకుని ఇచ్చాడు ఏంటి అని బాధపడేవాడని.. చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయా… ఇప్పుడు షీత‌ల్‌తో నా కుమారుడు చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నాడు.. వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పాడు.. రెండో భార్య షీత‌ల్ గురించి మాట్లాడుతూ ఆమె వచ్చాక నా లైఫ్ మారిపోయిందన్నాడు.

ఆ అమ్మాయికి దైవభక్తి ఎక్కువ చిన్న వయసే అయినా ఫుల్ మెచ్యూరిటీ మైండ్.. తనకు చాలా బాగా క్లారిటీ ఉంది. ఆమె వచ్చాకే నా కెరియర్ లైక్ పూర్తిగా మారిపోయిందని పృధ్వీరాజ్ తెలిపాడు. పృధ్విరాజ్ 1994లో బీనా అనే మహిళతో పెళ్లికాక కొంతకాలం క్రితమే వారిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత తనకంటే వయసులో చాలా చిన్నది అయినా షీత‌ల్‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news