Newsమోక్ష‌జ్ఞ తండ్రికి నిజంగానే వార్నింగ్ ఇచ్చాడా... ఈ ఫొటోయే సాక్ష్యం...!

మోక్ష‌జ్ఞ తండ్రికి నిజంగానే వార్నింగ్ ఇచ్చాడా… ఈ ఫొటోయే సాక్ష్యం…!

నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా నటించిన భగవంత్‌ కేసరి సినిమా దసరా కానుకగా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. బాలయ్య ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టేస్తారు.. ఆయన మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడరు. అలా మాట్లాడటం బాలయ్యకు అస్సలు ఇష్టం ఉండదు. తాజాగా భగవంత్‌ కేసరి ట్రైలర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఓ సంచలన విషయం బయట పెట్టారు. శ్రీలలను హీరోయిన్‌గా పెట్టి.. తాను హీరోగా సినిమా చేస్తానని బాలయ్య చెప్పగా తన కొడుకు మోక్షజ్ఞ ఫైర్ అయ్యాడట.

నీకు గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా డాడీ… శ్రీలీల నా పిల్ల అంటూ తండ్రికే స్వీట్ వార్నింగ్ ఇచ్చాడట. ఈ విషయాన్ని బాలయ్య స్వయంగా చెప్పారు. బాలయ్య ఏదో ఫ్లోలో అలా అనేసి ఉంటారని.. తండ్రిని మోక్షజ్ఞ నిజంగా అంత మాట అని ఉంటారా అని చాలామంది సందేహం వ్యక్తం చేశారు. ఎంత కొడుకు అయినా బాలయ్యను మోక్షజ్ఞ అంటే నందమూరి అభిమానులే ఊరుకోరు. అయితే తాజాగా రిలీజ్ అయిన ఫోటో చూస్తే బాలయ్య కామెంట్స్ నిజమే అని నమ్మాలి.

మోక్షజ్ఞ తన తండ్రికి నిజంగానే స్వీట్ వార్నింగ్ ఇచ్చాడేమో అనుకోవాల్సిందే. ఎందుకంటే శ్రీలీల పక్కన ప్రత్యక్షమయ్యాడు మోక్షజ్ఞ. బాలయ్య శ్రీలీల మీద చేయి వేసి ఉంటే పక్కనే మోక్షజ్ఞ ఉన్నాడు. భగవంత్ కేసరి టీంతో భేటీ అయ్యానంటూ ఫోటో షేర్ చేశాడు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్.

అందులో హీరో, దర్శ‌కుడు నిర్మాతతో పాటు శ్రీలీల‌ కూడా ఉంది. ఆమె పక్కనే నవ్వులు చిందిస్తూ మోక్షజ్ఞ కూడా కనిపించాడు. దీంతో శ్రీలీలతో సినిమా చేయాలని మోక్షజ్ఞకు నిజంగానే ఉత్సాహంగా ఉందని… అందుకే శ్రీలీలతో తన తండ్రి సినిమా చేస్తానంటే నిజంగానే మోక్షజ్ఞ కి కోపం వచ్చి ఉంటుందని చాలామంది సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news