Newsజిమ్‌లో మ‌హేష్ ఏం చేస్తున్నాడో చూడండి.. అబ్బ‌బ్బా ఏం ఉన్నాడ్రా బాబు..!

జిమ్‌లో మ‌హేష్ ఏం చేస్తున్నాడో చూడండి.. అబ్బ‌బ్బా ఏం ఉన్నాడ్రా బాబు..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును గ్రీకువీరుడుగా పోల్చే అభిమానులు చాలామంది ఉన్నారు. మహేష్‌ను సూపర్ స్టార్ గా.. హ్యాండ్సం భాయ్‌గా పిలుచుకునే అమ్మాయిలు ఎంతోమంది ఉన్నారు. నాలుగున్నర ప‌దుల వయసులో కూడా మహేష్ బాబు అందం చూసి పడిపోయే అమ్మాయిలకు లెక్కే ఉండదు. మహేష్ తన అందాన్ని కొంచెం తమకు కూడా ఇస్తే బాగుంటుందని అమ్మాయిలు కోరుకుంటూ ఉంటారు.

ప్రస్తుతం మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న మహేష్ ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే దర్శకధీరుడు రాజమౌళి తెర‌కెక్కించే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మహేష్ ఇంత అందంగా ఉండటానికి కారణం మనోడి జీన్స్ తో పాటు ఆయన కష్టం కూడా ఉంది. రెగ్యులర్గా డైట్ ఫాలో అవుతాడు.. ఎప్పుడు సేమ్ ఫిజిక్‌ మైంటైన్ చేస్తూ గ్లామర్ గా కనిపిస్తూ ఉంటాడు.

సోషల్ మీడియాలో ఆ ఫోటోలు కూడా షేర్ చేస్తూ అభిమానుల్లో ఉత్సాహం నింపుతూ ఉంటాడు. తాజాగా మహేష్ మరోసారి తాను వర్కౌట్ చేస్తున్న ఫోటోలను పోస్ట్ చేశాడు. బ్లాక్ అండ్ వైట్ కలర్ ఫోటోలో మహేష్ ఆర్మ్ ఎక్ససైజ్ చేస్తూ కనిపించాడు. ఆ పిక్ లో మహేష్ బైసెప్స్‌ బాగా కనపడుతున్నాయి. హార్డ్ వర్క్ విషయానికి వస్తే నలుపు తెలుపు అంటూ ఏమీ ఉండదు.. దానిని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకోవడమే అని కామెంట్ చేశాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news