Newsసురేఖ‌వాణిని ఫుల్లుగా వాడుకుని వ‌దిలేసిన వ్య‌క్తి ఎవ‌రు... టాలీవుడ్ హాట్ టాపిక్‌..!

సురేఖ‌వాణిని ఫుల్లుగా వాడుకుని వ‌దిలేసిన వ్య‌క్తి ఎవ‌రు… టాలీవుడ్ హాట్ టాపిక్‌..!

టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి బాగా పాపులర్ అయిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి. విజయవాడకు చెందిన సురేఖ వాణి ముందుగా బుల్లితెర‌పై కెరీర్‌ ప్రారంభించి ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అడపాదడపా సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ సూపర్ సక్సెస్ అయింది. ఐదు పదుల వయసుకు చేరువైన సురేఖ వాణి.. కూతురు సుప్రీత కూడా పెళ్లి వయసుకు వచ్చేసినా ఈ తల్లి, కూతుర్లు సోషల్ మీడియాలో ఎంత బోల్డ్‌గా ఎంత హాటుగా రచ్చ రచ్చ చేస్తారో తెలిసిందే.

ఇక కొన్నేళ్ల క్రితం సురేఖ వాణి భర్త హఠాత్తుగా చనిపోయారు. చిత్రం ఏంటంటే ? ఆ బాధ నుంచి త్వరగా బయటకు వచ్చేసిన సురేఖవాణి తన కూతురు సుప్రీతతో కలిసి హాట్ హాట్ ఫోటోలు.. చివరకు మద్యం సేవిస్తున్న ఫోటోలతో కూడా సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉంటుంది. అటు కూతురు సుప్రీత కూడా తల్లికి ఏమాత్రం తీసుకోకుండా హాట్‌గా కనిపిస్తూ ఉంటుంది. చాలామంది స్టార్ హీరోయిన్లకు లేని సోషల్ మీడియా ఫాలోయింగ్ ఈ తల్లి కూతుర్లకు ఉంది.

తాజాగా సురేఖ వాణి సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. అందులో ఆమె ఇచ్చిన మెసేజ్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్‌ టాపిక్ గా మారింది. నాకు ఎవరూ లేరు.. ఉండాలని కూడా నేను భావించడం లేదు.. లేని ప్రేమలు ఉన్నాయని ఫీల్ అవ్వటం వేస్ట్ అలా బతకలేను.. అవసరానికి వాడుకుని టైం వచ్చినప్పుడు చాలామంది వదిలేస్తూ ఉంటారు అని సురేఖ వాణి ఆ వీడియోలో వెల్లడించింది.

దీనిని బట్టి సురేఖ వాణిని ఎవరో వాడుకుని వదిలేసారు. అందుకే ఆమె బాధతో ఇలాంటి డైలాగులు చెబుతుందని అంటున్నారు. సురేఖవాణి గత కొద్ది రోజులుగా టాలీవుడ్ లో ఫేడౌట్ హీరోతో బంధాన్ని కొనసాగిస్తుందని.. అతడు ఆమె ఇంటికి చాలా సీక్రెట్ గా వచ్చి వెళుతున్నాడన్న గుసగుసలు వేపించాయి. మరి సురేఖ వాణిని మోసం చేసింది ఎవరు ? ఏంటన్న ప్రశ్నలకు ఆమె దగ్గరే సమాధానం ఉంటుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news