Newsకంగనా రనౌత్ సౌత్ సినిమాల‌కు... గుండు గీయ‌డానికి లింక్ ఏంటి...!

కంగనా రనౌత్ సౌత్ సినిమాల‌కు… గుండు గీయ‌డానికి లింక్ ఏంటి…!

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ పర్ఫార్మెన్స్ పరంగా ఎంతటి క్రేజ్ తెచ్చుకుందో అందరికీ తెలిసిందే. పొట్ట చేత్తో పట్టుకొని ముంబైలో అడుగుపెట్టిన కంగనా ఇంట్లో వాళ్ళని అసహ్యించుకున్న రోజులున్నాయి. ఎవరి మీదా ఆధారపడకుండా ముంబై వీధుల్లో ఎన్నో రోజులు పస్తులుంది. ఫుట్ పాత్ మీద గడిపిన సందర్భాలున్నాయి. వెండితెర మీద కనిపించేందుకు ఎన్ని కష్టాలు పడాలో, ఎన్ని అవమానాలు అనుభవించాలో అంతకంటే ఎక్కువ అనుభవించింది.

ఎట్టకేలకి బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ మీద ఓ వెలుగు వెలుగుతోంది. స్టార్ హీరోలకే కాదు కంగనా రనౌత్ కోసం ప్రత్యేకంగా కోట్ల బడ్జెట్ తో సినిమా నిర్మించడానికి కథలు సిద్ధమవుతున్నాయి. కంగనా లేకపోతే ఈ సినిమా లేదు..అనేంతగా పాపులారిటీ సంపాదించుకుంది. కంగనాకి బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా అసాధారణమైన క్రేజ్ ఉంది. హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కంగనా నటించిన సినిమాకి భారీ వసూళ్ళు వస్తున్నాయి.

కంగనా చేయలేను..అనేటువంటి పాత్ర ఇప్పటివరకూ ఏదీ లేదనే చెప్పాలి. గ్లామర్ రోల్ అయినా..తాగుబోతు పాత్ర అయినా..పర్ఫార్మెన్స్ ప్రధానంగా సాగే కథ అయినా, బయోపిక్ అయినా కంగనాకి కొట్టిన పిండి. అందుకే, నార్త్ నుంచి సౌత్ వరకూ తనపై కామెంట్స్ చేసిన వారిని ఉతికి ఆరేస్తుంటుంది. సోషల్ మీడియాలో సగం ప్లేస్ ఆక్యూపై చేసింది. ఇదంతా కంగనాకి ఉన్న పాపులారిటీ వల్లే జరుగుతుందని చెప్పాల్సిందే.

కానీ, ఈ టాలెంటెడ్ బ్యూటీ సౌత్ ఇండస్ట్రీకి మాత్రం పనికిరావడం లేదు. ఇక్కడ కంగనా సాధించిన సక్సెస్ ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. తెలుగులో పూరి జగన్నాథ్ పరిచయం చేస్తూ ఏక్ నిరంజన్ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో ప్రభాస్ హీరో. అయితే, కంగనా పర్ఫార్మెన్స్ కి తెలుగు జనాలు పెదవి విరిచారు. అమ్మడు ఇక్కడ ఒక్క సినిమాకే సర్దుకుంది. ఆ తర్వాత తమిళంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత సినీ, రాజకీయ చరిత్ర ఆధారంగా తలైవి తెరకెక్కింది.

ఇందులో కంగనా టైటిల్ రోల్ పోషించగా ఏమాత్రం మెప్పించలేకపోయింది సరి కదా తిరిగి ట్రోల్స్ కి గురైంది. ఆ తర్వాత బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ గా వచ్చిన చంద్రముఖి 2 లో టైటిల్ రోల్ పోషించింది. కనీసం లుక్ పరంగా కూడా ఆకట్టుకోలేకపోయింది. ఇక పర్ఫార్మెన్స్ పరంగా అయితే, చీ కొట్టినవాళ్ళే ఎక్కువ ఉన్నారు. అందుకే, మళ్ళీ కంగనా సౌత్ సినిమా అంటూ కనిపిస్తే గుండు గీయడం గ్యారెంటీ..అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఇలాంటి కామెంట్స్ కి కంగనా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news