Moviesషారుక్ కంటే హృతిక్‌తోనే బెట‌ర్ రొమాన్స్‌... భ‌ర్త ప‌క్క‌న ఉండ‌గానే దీపిక...

షారుక్ కంటే హృతిక్‌తోనే బెట‌ర్ రొమాన్స్‌… భ‌ర్త ప‌క్క‌న ఉండ‌గానే దీపిక కామెంట్స్ ర‌చ్చ‌..

దేశవ్యాప్తంగా కాఫీ విత్ కర‌న్ కి ఉన్న క్రేజ్ గురించి తెలిసిం.ది మోస్ట్ అవైటెడ్ టాక్ షోలలో ఇది ఒకటి. ఇప్పుడు ఈ షో ఎనిమిదో సీజన్లోకి ఎంటర్ అయింది. ఇప్పటికే డిస్నీ + హాట్ స్టార్ కొద్దీ వారాల క్రితం ఈ షో గురించి అధికారికంగా ప్రకటించింది. మొదటి ఎపిసోడ్ అక్టోబర్ 25వ తేదీ అర్ధరాత్రికి స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా ఈ ఎపిసోడ్ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ట్రైలర్ ఆద్యంతం ఫ‌న్‌తో పాటు వ్యక్తిగతంగా చాలా తెలియని విషయాలు బయట పెట్టింది.

కరణ్ జోహార్ ఫేవరెట్ జంట బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొనే – రణవీర్ సింగ్ ఈ కార్యక్రమానికి తొలి అతిథులుగా హాజరయ్యారు. ఫస్ట్ ఈ జంట చాలా సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారని రణవీర్ సింగ్ వెల్లడించడంతో ట్రైలర్ ఆసక్తిని పెంచింది. అలాగే రణవీర్.. కరణ్ జోహార్ ని టర్కీ అంకుల్ అని పిలవటం ఒక చమక్కు అయితే.. దీపిక మాత్రం రణవీర్ కాకుండా హృతిక్ రోష‌న్‌తో స్క్రీన్ పై బెస్ట్ కెమిస్ట్రీ తనకు బాగా వర్క్ అయిందని వెల్లడించింది.

ఈ ఏడాది దీపిక పదుకొనే షారుక్ ఖాన్‌తో పఠాన్ సినిమాలో అదిరిపోయే రొమాన్స్ చేసింది. వీరిద్దరి రొమాన్స్ పఠాన్ సినిమా బ్లాక్ బస్టర్ విజయంలో ఎంతో కీలకంగా నిలిచింది. అయితే దీపిక మాత్రం షారుక్ పేరు ఎత్తలేదు. హృతిక్‌తో తనకు వెండి తెరమీద బెస్ట్ కెమిస్ట్రీ వర్కౌట్ అయిందని తెలిపింది. ఇక రణబీర్ – దీపిక ఈ కార్యక్రమంలో కలిసి కనిపించడం ఇదే తొలిసారి కావటంతో ఈ ఎపిసోడ్ ఇప్పుడు సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందన్న అంచనాలు ఉన్నాయి.

ఇంతకుముందు రణవీర్.. అలియాభట్, రణబీర్ కపూర్ సహా ఇతరులతో కలిసి కనిపించాడు. కానీ దీపితో కలిసి కనిపించడం ఇదే మొదటిసారి. అలాగే దీపిక కూడా గతంలో తన సహచరులతో కలిసి కనిపించింది వీరిద్దరూ కలిసి ఈ షోలో కనిపించడం ఇదే ఫస్ట్ టైం కావ‌డంతో ఈ షోకోసం దేశ‌వ్యాప్తంగా కోట్లాది క‌ళ్లు వెయిట్ చేస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news