Newsబుక్ మై షోలో ' భ‌గ‌వంత్ కేస‌రి ' అరాచ‌కం.. బాల‌య్య...

బుక్ మై షోలో ‘ భ‌గ‌వంత్ కేస‌రి ‘ అరాచ‌కం.. బాల‌య్య రికార్డ్‌ల దుమ్ముదులిపాడుగా..!

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కించిన లేటెస్ట్ సూపర్ హిట్ సినిమా “భగవంత్ కేసరి” . ఈ సినిమా ఈ దసరా కానుకగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి సూప‌ర్ హిట్ టాక్‌తో… వచ్చిన ఈ సినిమా సూపర్ స్ట్రాంగ్ వసూళ్లతో అదరగొడుతోంది. కేవ‌లం 4 రోజుల్లోనే వ‌ర‌ల్డ్ వైడ్‌గా రు. 106 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు కొల్ల‌గొట్టింది.

ఈ సినిమాకు లాంగ్ ర‌న్ ఉండే ఛాన్సులు ఉన్నాయి. పైగా ద‌స‌రా సెల‌వులు కావ‌డంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సాలీడ్ ఆక్యుపెన్సీ న‌మోదు అయిన‌ట్టుగా ట్రేడ్ వ‌ర్గాల రిపోర్టులు చెపుతున్నాయి. ఇక ఈ రోజు ఉద‌యం నుంచే ప్ర‌ముఖ టిక్కెట్ల బుకింగ్ యాప్ బుక్ మై షోలో అయితే సాలిడ్ బుకింగ్స్ న‌మోదు అవుతున్నాయి. భ‌గ‌వంత్ కేస‌రి కంప్లీట్ ద‌స‌రా విన్న‌ర్‌గా టాలీవుడ్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దూసుకు పోతోంది.

ఈ రోజు బుక్ మై షో యాప్‌లో 15 వేల టిక్కెట్లు ఉద‌యానికే బుక్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా… యంగ్ బ్యూటీ శ్రీలీల ముఖ్య పాత్రలో నటించింది. అలాగే థమన్ సెన్సేషనల్ మ్యూజిక్ అందించాడు. అఖండ‌, వీర‌సింహారెడ్డి లాంటి రెండు సూప‌ర్ హిట్ల త‌ర్వాత ఈ సినిమాతో బాల‌య్య హ్యాట్రిక్ హిట్లు కొట్టాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news