News' గుంటూరు కారం ' ఏపీ, తెలంగాణ థియేట్రిక‌ల్ బిజినెస్‌... ఆల్...

‘ గుంటూరు కారం ‘ ఏపీ, తెలంగాణ థియేట్రిక‌ల్ బిజినెస్‌… ఆల్ టైం ఇండియా రికార్డ్‌..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ గుంటూరు కారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాలో మహేష్ బాబు చాలా రోజుల తర్వాత మాస్ పాత్ర చేస్తుండగా.. మహేష్ కి జోడిగా శ్రీలీల – మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రకాష్ రాజు, రమ్యకృష్ణ, జగపతిబాబు, జయరాం, సునీల్, ఆలీ, హైపర్ ఆది తదితరులు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు.

తమన్‌ ఈ సినిమాకు స్వరాలు అందిస్తున్నారు. 13 సంవత్సరాల ( ఖ‌లేజా) తర్వాత త్రివిక్రమ్ – మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ ముందే సంచలన రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఇప్పటికే డిజిటల్ రైట్స్ – ఆడియో రైట్స్ విషయంలో అదిరిపోయే రికార్డు సెట్ చేసింది. తాజాగా ఈ మూవీ యొక్క ఏపీ – తెలంగాణ థియేటర్ రైట్స్ రు. 120 కోట్లకు అమ్ముడయ్యాయి.

ఓవరాల్ గా వరల్డ్ వైడ్ ఈ సినిమా థియేటర్ రైట్స్ రు. 155 కోట్లకు క్లోజ్ కానున్నాయి. మొత్తంగా రీజనల్ సినిమాల్లో ఇది భారీ రికార్డు అని చెప్పాలి. కేవలం ఒక ప్రాంతీయ భాషలో తెరకెక్కిన ఈ సినిమాకు రు. 155 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగటం అంటే మామూలు విషయం

హారిక హాసిని క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర రాధాకృష్ణ భారీగా ఈ సినిమాను నిర్మిస్తుండగా.. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news