Movies' భ‌గ‌వంత్ కేస‌రి ' ట్రైల‌ర్‌... బాల‌య్య జోరు.. చిరు బేజారు..!

‘ భ‌గ‌వంత్ కేస‌రి ‘ ట్రైల‌ర్‌… బాల‌య్య జోరు.. చిరు బేజారు..!

బాలయ్య నటిస్తున్న భగవంత్ కేసరి ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ అయితే అదిరిపోయింది. కేక పెట్టించేసింది. అటు బాలయ్య అభిమానులతో పాటు మాస్ అభిమానులు.. అనిల్ రావిపూడి అభిమానులతో పాటు ఓవరాల్ గా ఈ సినిమాపై ఎన్నో ఆశలు.. అంచనాలతో ఎదురుచూస్తున్న తెలుగు సినిమా ప్రేక్షకులు అందరినీ మెప్పించేసింది. అయితే ఈ సినిమా ట్రైలర్ బయటకు వచ్చిన వెంటనే ఇటీవల రిలీజ్ అయిన చిరంజీవి ఎపిక్ డిజాస్టర్ భోళా శంకర్ , భగవంత్ కేసరి మధ్య ఒక పోలికను నెటిజెన్లు తెర‌మీద‌కు తీశారు.

అది కూడా చాలా లాజికల్ గా కనిపిస్తోంది. భోళా శంకర్ సినిమాలో చిరంజీవి తెలంగాణ యాసలో మాట్లాడారు. భగవంత్ కేసరిలో కూడా బాలయ్య తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడారు. ఇదే విషయాన్ని కంపేరిజన్ చేస్తే చిరంజీవి కంటే బాలకృష్ణ తెలంగాణ యాస బాగా పలికారన్నట్టుగా సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఈ ట్రైలర్లో బాలయ్య తనదైన మార్క్ డైలాగులు చెప్పారట. వాటిని తెలంగాణ యాసలో పలికారు.

బాలయ్య తొలిసారిగా పూర్తిస్థాయిలో తెలంగాణ నేపథ్యాన్ని ఎంచుకుని ? చేసిన సినిమా కావటం విశేషం. దీంతో ఆయన తెలంగాణ యాస ఎలా ? ఉంటుందన్న ఆసక్తి సహజంగానే అందరిలోనూ ఉంది. ట్రైలర్లో బాలయ్య తెలంగాణ స్లాంగ్‌లో అదరగొట్టేశాడు. ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ లో కూడా బాలయ్య అక్కడక్కడ తెలంగాణ యాసలో మాట్లాడి అందరిని మెప్పించాడు. సరిగ్గా ఇదే టైంలో భోళా శంకర్ లో చిరంజీవి మాట్లాడిన యాస తెర మీదకు వచ్చింది.

ఆ సినిమాలో కూడా తెలంగాణ మాండలికంలో మాట్లాడారు చిరు. అయితే అది చాలా కృత్రిమంగా.. ఎబెట్టుగా అనిపించింది. దానిపై అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు బాలయ్య తెలంగాణ యాసలో బ్రహ్మాండంగా మాట్లాడడంతో ఇది సహజంగానే చిరుతో కంపేరిజ‌న్‌కు వ‌స్తోంది..ఈ విషయంలో బాలయ్య తనదైన స్టైల్ లో జోరు చూపిస్తే.. చిరంజీవి కాస్త తడబడ్డారు అన్న చర్చలతో ఏకీభవించాల్సిందే..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news