Newsమోక్ష‌జ్ఞ తొలి సినిమా హీరోయిన్‌గా శ్రీలీల‌.. క‌న్‌ఫార్మ్ చేసింది కూడా మోక్ష‌జ్ఞే...!

మోక్ష‌జ్ఞ తొలి సినిమా హీరోయిన్‌గా శ్రీలీల‌.. క‌న్‌ఫార్మ్ చేసింది కూడా మోక్ష‌జ్ఞే…!

ఈ టైటిల్ వినడానికి చాలా చిత్ర విచిత్రంగా ఉంటుంది. బాలయ్య తనయుడు నందమూరి మోక్షజ్ఞ తెలుగు తెరపై హీరోగా ఎంట్రీ ఇస్తాడని నాలుగైదు సంవత్సరాలుగా వార్తలు వస్తున్నా ఇప్పటికి ఆ వార్త నిజం కావట్లేదు. నందమూరి అభిమానులు కూడా మోక్షజ్ఞ ఎప్పుడు హీరోగా వస్తాడా ? అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి టైంలో మోక్షజ్ఞ తొలి సినిమాలో మనోడికి జోడిగా శ్రీ లీల హీరోయిన్గా నటించడం ఏంటి ? ఇది నిజమేనా అని సందేహం అందరిలో కలుగుతోంది.

ఎస్ ఇదే విషయాన్ని బాలయ్య కన్ఫామ్ చేశారు. బాలయ్య తాజాగా నటించిన సినిమా భగవంత్ కేసరి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న థియేటర్లలోకి రాబోతోంది.ఈ సినిమాలో బాలయ్య విలన్ కు గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. అయితే ఇదే డైలాగ్ తో బాలయ్యకు నిజ జీవితంలో తన తనయుడు మోక్షజ్ఞ నుంచి వార్నింగ్‌ వచ్చిందట. ఈ విషయాన్ని భగవంత్ కేసరి ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో బాలయ్య స్వయంగా చెప్పారు.

అసలు విషయంలోకి వెళితే ఆదివారం ఉదయం బాలయ్య , శ్రీలీలతో ఒక మాట అన్నాడట. ఇద్దరం కలిసి నటించాం సరే.. నువ్వు చిచ్చా చిచ్చా అని నన్ను టార్చర్ పెట్టావు..తర్వాత సినిమాలో మనం హీరో, హీరోయిన్లుగా నటిద్దామని చెప్పాను.. ఇదే మాట ఇంటికెళ్లి మా కుటుంబ సభ్యులతో చెప్పాను.. వెంటనే నా కొడుకు మోక్షజ్ఞకు కోపం వచ్చేసింది. ఏం డాడీ నేను హీరోగా రాబోతున్నాను నువ్వు ఆవిడకు ఆఫర్ ఇస్తాను అంటావేంటి..నీకు గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా డాడీ అన్నాడట మోక్షజ్ఞ..!

మోక్షు అలా ఎందుకు అన్నాడో కాసేపు నాకు అర్థం కాలేదు.. ఇలా తన కొడుకు తనకు వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని బాలయ్య బయట పెట్టాడు.. దీంతో స్టేజ్ పై ఉన్న‌వారంతా పక్కున నవ్వేశారు. మోక్షజ్ఞ బాలయ్యకు వేసిన కౌంటర్లో అర్థం ఏంటంటే మనోడికి శ్రీలీల‌ పక్కన హీరోగా చేయాలన్న కోరిక ఉందని.. తన మనసులో మాట నేరుగా డాడీకి చెప్పకనే చెప్పేసాడట. అందుకే బాలయ్య, శ్రీలీలకు జోడిగా నటిస్తానని అనటం మోక్షజ్ఞకు ఇష్టం లేనట్టుగా కనిపించింద‌న్న‌ది అసలు విషయం అది..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news