News' భ‌గ‌వంత్ కేస‌రి ' అడ్వాన్స్ బుకింగ్స్ కేక‌... బాల‌య్యా ఏంది...

‘ భ‌గ‌వంత్ కేస‌రి ‘ అడ్వాన్స్ బుకింగ్స్ కేక‌… బాల‌య్యా ఏంది సామీ ఈ క్రేజ్‌..!

నందమూరి నట‌సింహ బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా దర్శకుడు అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన మాసివ్‌ యాక్షన్ ఎంటర్టైనర్ భగవంత్‌ కేసరి. శ్రీలీల‌ బాలయ్య కూతురు పాత్రలో నటించిన ఈ సినిమా దసరా కానుకగా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అఖండ – వీరసింహారెడ్డి లాంటి రెండు సూపర్ డూపర్ హిట్ సినిమాల తర్వాత బాలయ్య నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు.

ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు, టీజర్లు, ట్రైలర్లు కూడా దుమ్ము రేపుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాతో బాలయ్య ఖచ్చితంగా హ్యాట్రిక్ హిట్లు కొడతారన్న అంచనాలు మామూలుగా లేవు. బాలయ్య గత రెండు సినిమాలు అఖండ – వీరసింహారెడ్డి రెండు యూఎస్‌లో దులిపేసాయి. ఇప్పుడు వీరసింహారెడ్డి రిలీజ్ కు మరో వారం రోజులు ఉండగానే అక్కడ ఫ్రీ సేల్స్ లో చాలా స్ట్రాంగ్ గా ముందుకు వెళుతుంది.

ఆల్రెడీ యూఎస్ లో ఈ సినిమాకు 1,50,000 పైగా డాలర్ల వసూళ్లు వచ్చాయి. ఈ సినిమా రిలీజ్ కు మరో ఏడు రోజుల టైం ఉండడంతో కచ్చితంగా హాఫ్ మిలియన్ మార్కు దాటేసి.. మిలియన్ మార్క్ డాల‌ర్ల వైపు దూసుకుపోతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమాకు వ‌రల్డ్ వైడ్‌గా రు.100 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news