Moviesరాజమౌళి స్ధానాన్ని అందుకోబోయే నెక్స్ట్ డైరెక్టర్ అతడేనా..? రేసులో ఉన్న టాప్...

రాజమౌళి స్ధానాన్ని అందుకోబోయే నెక్స్ట్ డైరెక్టర్ అతడేనా..? రేసులో ఉన్న టాప్ దర్శకులు వీళ్లే..!

ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ డైరెక్టర్ ఎవరు అంటే కళ్ళు మూసుకొని అందరూ చెప్పే ఒకే ఒక్క పేరు రాజమౌళి . దర్శక ధీరుడుగా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా రాజమౌళి తెరకెక్కించే సినిమాలు జనాలకి బాగా నచ్చేస్తూ ఉంటాయి. కాగా రాజమౌళి తర్వాత ఆయన స్థానాన్ని అందుకునేది ఎవరు అనే విషయం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. కాగా ఆ లిస్టులో ప్రధానంగా నలుగురి డైరెక్టర్లు పేర్లు వినిపిస్తున్నాయి .

వాళ్లు మరెవరో కాదు నాగ్ అశ్వీన్.. సందీప్ రెడ్డివంగా.. సుజిత్ ..ప్రశాంత్ వర్మ . ఎస్ మహానటి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్గా మారిపోయిన నాగ్ అశ్వీన్.. రాజమౌళి స్థాయిని అందుకునే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు అభిమానులు . కల్కి సినిమాతో అది ప్రూవ్ అయిపోతుంది అంటూ కూడా ప్రచారం చేస్తున్నారు . అర్జున్ రెడ్డి తో యానిమల్ సినిమాలతో తానేంటో ప్రూవ్ చేసుకున్న సందీప్ రెడ్డివంగా కూడా ఆలిస్టులోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు .

సాహో సినిమాతో ఒక్కసారిగా అభిమానులకి ఫేవరెట్ గా మారిపోయిన సుజిత్ సైతం రాజమౌళి స్థానాన్ని అందుకునే ఛాన్సెస్ ఉన్నాయి అంటూ చెప్పుకొస్తున్నారు. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్గా మారిపోయిన ప్రశాంత్ వర్మ ..ఆయన సినిమాటిక్ యూనివర్స్ లో తెరకెక్కించే సినిమాలు చూస్తుంటే కచ్చితంగా రాజమౌళి ప్లేస్ ని ఆకుపై చేసుకునే అంత సత్తా ఉన్న డైరెక్టర్ అంటున్నారు జనాలు . ఇలా రాజమౌళి తర్వాత ఆయన స్థానాన్ని అందుకోవడానికి ఈ నలుగురు డైరెక్టర్లు బాగా పోటీపడుతున్నారు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news