Newsఎన్టీఆర్ ' దేవ‌ర‌ ' లో మ‌రో స్టార్ హీరో... ఊహించ‌ని...

ఎన్టీఆర్ ‘ దేవ‌ర‌ ‘ లో మ‌రో స్టార్ హీరో… ఊహించ‌ని స‌ర్‌ఫ్రైజ్ ఇది..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమా దేవర. ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నట్టు దర్శకుడు కొరటాల శివ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుని ఆ తర్వాత వార్ 2… ఆ తర్వాత ప్రశాంత్ నీల్‌ సినిమాలు పూర్తి చేస్తారు. ఆ వెంటనే దేవర సిక్వెల్ 2 కూడా సెట్స్ మీదకు వెళుతుంది.

ఇక దేవర సినిమాపై మామూలు అంచనాలు లేవు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ ను ఢీకొట్టే విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఎన్టీఆర్ ద్విపాత్రభినయం చేస్తారన్న ప్రచారం కూడా గట్టిగా జరుగుతోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో ప్రతి పాత్రను దర్శకుడు కొరటాల శివ చాలా బలంగా డిజైన్ చేశాడని టాక్.

ఇండియా మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని మరో క్రేజీ పాత్రను కూడా డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఓ బాలీవుడ్ స్టార్ హీరో కనిపిస్తాడట. ఈ పాత్ర సెకండాఫ్ లో వస్తుందని.. కథ అంతా ఈ పాత్ర చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. ఇదే నిజమైతే ఈ సినిమాకు నార్త్‌లో సైఫ్ ఆలీఖాన్‌, హీరోయిన్ జాన్వీక‌పూర్‌తో పాటు మరో స్టార్ హీరో కూడా ఉంటే మార్కెట్ అదిరిపోతుందని చెప్పాలి.

దేవర సినిమాను రు. 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కోసమే కొరటాల శివ ఏకంగా ఏడాదిన్నర టైం తీసుకున్నారు. జనతా గ్యారేజ్ లాంటివి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత ఎన్టీఆర్ – కొరటాల శివ కలయికలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news