Movies"ఆ గబ్బు సినిమా ఎవరు చేస్తారు"..యానిమల్ ను రిజెక్ట్ చేసిన తెలుగు...

“ఆ గబ్బు సినిమా ఎవరు చేస్తారు”..యానిమల్ ను రిజెక్ట్ చేసిన తెలుగు హీరో ఎవరో తెలిస్తే షాక్ అయిపోతారు..!!

అర్జున్ రెడ్డి .. లాంటి కల్ట్ బ్లాక్ బస్టర్ మూవీని తెరకెక్కించిన సందీప్ రెడ్డి వంగ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్న సినిమా అనిమల్.. హాలీవుడ్ బడా హీరో రణ్బీర్ కపూర్ ఈ సినిమాలో హీరోగా నటిస్తూ ఉండగా ..రష్మిక మందన్నా ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది .. నిన్న ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు . ఈ టీజర్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలు మొదలయ్యాయి .

చాక్లెట్ బాయ్ లాంటి రన్బీర్ ని ఇంత వైల్ యాంగిల్ లో చూపించడం సందీప్ రెడ్డి వంగాకే చెల్లింది అంటూ పొగిడేస్తుంటే .. మరికొందరు మాత్రం ఈ సినిమాని మిస్ చేసుకున్న తెలుగు హీరో పై కామెంట్స్ చేస్తున్నారు . నిజానికి సందీప్ రెడ్డి వంగ ఈ కథను తెలుగు హీరో కోసం రాసుకున్నారట . ఆయన మహేష్ బాబు ని ఈ రోల్ కోసం అనుకున్నారట. అయితే మహేష్ బాబు ఇలాంటి వైల్డ్ యాంగిల్ లో నేను నటించను అంటూ చెప్పడంతోనే ఈ కథను రన్బీర్ కపూర్ తో తెరకెక్కించే విధంగా ఆయన ప్లాన్ చేసుకున్నారట .

ఒకవేళ మహేష్ బాబు ఈ కథను యాక్సెప్ట్ చేసుంటే ఆ గుబురు గడ్డం లుక్స్ లో మనం మహేష్ బాబును చూసి ఉండాలి.. మహేష్ బాబు అభిమానులు మాత్రం రిజెక్ట్ చేసి మంచి పని చేశావు అంటుంటే ..మరి కొంత మంది మాత్రం ఎప్పుడూ ఒకేరోల్స్ చేస్తే ఎలా..? డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ చేయాలి ..మహేష్ తప్పు చేశాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో అనిమల్ సినిమాకి సంబంధించిన టీజర్ టాక్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news