Movies' భ‌గ‌వంత్ కేస‌రి ' మేకింగ్ వీడియోలో ఈ ట్విస్ట్ చూశారా...

‘ భ‌గ‌వంత్ కేస‌రి ‘ మేకింగ్ వీడియోలో ఈ ట్విస్ట్ చూశారా ( వీడియో)

నటసింహం నందమూరి బాలకృష్ణ, యంగ్‌ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రలో మ‌రో క్రేజీ హీరోయిన్‌ శ్రీలీల నటిస్తోంది. బాలీవుడ్ సీనియ‌ర్ హీరో అర్జున్ రామ్ పాల్ బాల‌య్య‌ను ఢీకొట్టే ప‌వ‌ర్ ఫుల్ విలన్ గా కనిపిస్తున్నాడు.

ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై హరీష్ పెద్ది – సాహు గారపాటి ఏకంగా రు.110 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే రిలీజ్ అయిన స్టిల్స్‌, పోస్ట‌ర్లు, టీజ‌ర్లు అయితే దుమ్ము లేపేస్తున్నాయి. థ‌మ‌న్ అందించిన సంగీతం ఏ రేంజ్లో ఉండ‌బోతోందో టీజ‌ర్ చెప్ప‌క‌నే చెప్పేసింది. ఇక ఫస్ట్ సాంగ్ గణేష్ ఆంథంకు అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తోంది.

తాజాగా రిలీజ్ అయిన మేకింగ్ వీడియోలో షూటింగ్ పూర్త‌వ్వ‌డంతో పాటు అక్టోబ‌ర్ 19నే రిలీజ్ అవుతుందంటూ మేక‌ర్స్ క్లారిటీ ఇచ్చేశారు. ఇక ఈ మేకింగ్ వీడియోలో సినిమా ఏ రేంజ్‌లో ? ఎలా ఉండ‌బోతోందో చెప్పేశారు. హెలీకాఫ్ట‌ర్ ఫైట్లు, కార్లు గాల్లోకి లేప‌డం.. బాల‌య్య బారుగా ఉన్న తుపాకీ గన్‌తో రౌడీల భ‌ర‌తం ప‌ట్టేందుకు వ‌స్తూ ఉండ‌డం లాంటి విజువ‌ల్స్ చూస్తుంటే బాల‌య్య మార్క్ యాక్ష‌న్‌తో పాటు అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, ఇటు సెంటిమెంట్‌తో క‌థ ఉంటుంద‌ని తెలుస్తోంది.

ఇక కాజ‌ల్ కాస్త ఏజ్ బార్ భార్య‌గా క‌నిపించ‌నుంద‌ని తెలుస్తోంది. శ్రీలీల అటు గ్లామ‌ర్ యాంగిల్లోనూ ఇటు సెంటిమెంట్ పాత్ర‌లోనూ క‌నిపించ‌బోతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news