Newsస‌మంత‌కు సంతోషం లేదా బాధ క‌లిగితే ఏం చేస్తుందో తెలుసా... !

స‌మంత‌కు సంతోషం లేదా బాధ క‌లిగితే ఏం చేస్తుందో తెలుసా… !

సమంత రూత్ ప్రభు గత కొంతకాలంగా మయోసైటీస్ వ్యాధికి చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల శాకుంతలం – ఖుషి సినిమాలతో ఆమె ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శాకుంతలం డిజాస్టర్ కాగా ఖుషి అంచనాలు అందుకోలేదు. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సమంత అమెరికాలో మయోసైటీస్‌కు చికిత్స తీసుకొని ముంబైలో రిలాక్స్ అవుతున్నారు. ఎప్పటికప్పుడు ప్రకృతి దృశ్యాలను ఆస్వాదిస్తున్న ఫోటోలను షేర్ చేస్తూ కామెంట్లు రాస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటుంది సమంత.

సమంత అమెరికా పర్యటన ముగించి ఇండియాకు వచ్చినప్పటి నుంచి కొత్తగా అప్డేట్లను పోస్ట్ చేస్తోంది. తాజాగా తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో అందమైన ప్రకృతి ఫోటోల బంచును షేర్ చేసింది. తాను కష్టకాలంలో ఎక్కువగా ఇష్టపడే సినిమా గురించి కూడా సమంత కామెంట్ చేసింది. తాను చిన్నతనంలో చాలా సంతోషంగా లేదా చాలా బాధగా అనిపించినప్పుడు సౌండ్ ఆఫ్ మ్యూజిక్ సినిమాను మళ్ళీ మళ్ళీ చూసే దానిని అని.. వాటన్నిటి నుంచి నేను తప్పించుకునే మార్గం ఇదే.. అది నన్ను నేను మర్చిపోయి మాయా ప్రపంచానికి తీసుకు వెళుతుందని తెలిపింది.

ఇది ఒక ఆధ్యాత్మిక ప్రదేశం. నేను పెద్దయ్యాక తిరిగి సినిమాకి వెళ్తాను.. కొన్ని సినిమాలు ప్రతిసారి పరిశీలించుకున్నప్పుడు మెరుగవుతూ ఉంటాయి. కానీ సౌండ్ ఆఫ్ మ్యూజిక్ అలాగే ఉంటుంది.. మన బాల్యంలోకి మనల్ని ప్రయాణించేలా చేస్తుంది. మీరు కూడా మీ బాల్యానికి తిరిగి వెళ్ళండి అనే కామెంట్ జోడించింది.

ఇక సమంత షేర్ చేసిన ఫోటోలలో సమంత ప్రకృతి దృశ్యాలను ఆశీర్వదిస్తున్నట్టు.. ఇక మూడో పోస్టులో సౌండ్ ఆఫ్ మ్యూజిక్ సినిమాలోని ఒక సన్నివేశాన్ని కూడా సమంత షేర్ చేసింది. ఇక సమంత వరుణ్ దావన్‌తో కలిసి నటించిన సిటాడెల్ ఇండియన్ వెర్షన్ త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ సినిమాకు రాజ్ డీకే దర్శకత్వం వహించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news