Newsర‌వితేజ‌కు నో చెప్పిన శ్రీలీల‌... ఇంత షాక్ ఇవ్వ‌డానికి కార‌ణం ఇదే...!

ర‌వితేజ‌కు నో చెప్పిన శ్రీలీల‌… ఇంత షాక్ ఇవ్వ‌డానికి కార‌ణం ఇదే…!

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ బిజియస్ట్ హీరోయిన్ ఎవరు ? అంటే ముందుగా శ్రీలీల పేరే వినపడుతోంది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో ఏకంగా 10 కి పైగా సినిమాలు ఉన్నాయి. విడుదలకు రెడీగా ఉన్న సినిమాల దగ్గర నుంచి త్వరలో సెట్స్ మీదకు వెళ్లే సినిమాల వరకు చాలా సినిమాలలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఇప్పుడు శ్రీలీలకు చాలా పెద్ద కష్టం వచ్చి పడింది. వరుస‌పెట్టి ఆమెకు అవకాశాలు వస్తూ ఉండడంతో ఏ సినిమా ఓకే చెప్పాలి ఏ సినిమా వదులుకోవాలన్న విషయంలో శ్రీలీలకు క్లారిటీ లేకుండా పోయింది.

అన్ని క్రేజీ ప్రాజెక్టులు.. స్టార్ హీరోలు, స్టార్ట్ దర్శకులు సినిమాలే ఆమెకు వస్తున్నాయి. అసలు సెట్స్ మీద ఉన్న సినిమాలకే ఆమె డేట్లు ఇవ్వడం కష్టంగా ఉందట. వాటినే గ్యాప్ లేకుండా నిద్ర లేకుండా చేస్తుంది. ఈ సమయంలో ఆమెకు మరికొన్ని ఆఫర్లు వచ్చాయి. డేట్లు సర్దుబాటు కాక కొన్ని సినిమాలు వదులుకుంటున్న పరిస్థితి కూడా..! రీసెంట్గా విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్నూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో శ్రీలీలను హీరోయిన్గా అనుకున్నారు.

డేట్లు సర్దుబాటు కాక ఆమె ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుందట. ఇక రవితేజ సినిమాలోను ముందుగా ఆమె హీరోయిన్గా అనుకున్నారు. ఈ సినిమాకు మలినేని గోపీచంద్ ద‌ర్శ‌కుడు. అయితే రవితేజతో ఇప్పటికే ధమాకా సినిమా చేసిన శ్రీలీల‌ మరోసారి ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో రవితేజతో చేయడం ఇష్టం లేక నో చెప్పేసిందట.

ఈ సినిమా కోసం ఆమెకు నాలుగు కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసిన కూడా రవితేజతో సినిమా చేయనని చెప్పేసిందట. ఏది ఏమైనా మ‌రికొన్ని సంవ‌త్స‌రాల పాటు టాలీవుడ్‌లో శ్రీలీల హ‌వాకు తిరుగులేదని చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news