News' ఖుషి ' 2 డేస్ వ‌సూళ్లు... బాక్సాఫీస్ ద‌గ్గర విజ‌య్...

‘ ఖుషి ‘ 2 డేస్ వ‌సూళ్లు… బాక్సాఫీస్ ద‌గ్గర విజ‌య్ వీర‌విహారం…!

లైగ‌ర్ లాంటి డిజాస్టర్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ నటించిన సినిమా ఖుషి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌ల్ట్ క్లాసిక్ మూవీ టైటిల్‌తో 20 ఏళ్ల త‌ర్వాత విజ‌య్ మళ్లీ ఖుషి సినిమా చేశాడు. సమంత హీరోయిన్గా నటించింది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు తొలి రోజే సూపర్ హిట్ టాక్ వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని – రవిశంకర్ ఎలమంచిలి ఈ సినిమాను నిర్మించారు.

రిలీజ్ రోజే ప్రపంచ వ్యాప్తంగా రు. 30 కోట్ల వసూళ్లు చేసిన ఖుషి రెండో రోజు కూడా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపింది. రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రు. 50 కోట్లకు పైగా గ్రాస్ వ‌సూళ్లు సాధించినట్టు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఓవర్సీస్ లోను రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించింది.

ఇప్పటికే అక్కడ మిలియన్ డాలర్ల మార్క్ క్రాస్ చేసి రెండు మిలియన్ డాలర్ల వైపు పరుగులు పెడుతోంది. ఇక రెండో రోజుల్లో ఈ సినిమాకు దాదాపు రు. 30 కోట్ల నెట్‌ వసూలు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో జయరాం – మురళి శర్మ – లక్ష్మి – ఆలీ – రోహిణి – వెన్నెల కిషోర్ కీలకపాత్రలో కనిపించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news