Movies"అలా చేస్తే ఇంకోసారి నీ ముఖం కూడా చూడను"..ఆ విషయంలో కోవై...

“అలా చేస్తే ఇంకోసారి నీ ముఖం కూడా చూడను”..ఆ విషయంలో కోవై సరళకు వార్నింగ్ ఇచ్చిన బ్రహ్మానందం..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరో హీరోయిన్లు జతకట్టిన కోవై సరళ – బ్రహ్మానందం జతకడితే వచ్చే కిక్ మరి ఏ కపుల్స్ కట్టిన రాదని చెప్పాలి . సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బ్రహ్మానందం.. కోవై సరళ కామెడీ టైమింగ్ ముందు ఇప్పటివరకు ఏ కమెడియన్ పనికిరారు . ఆ విషయం చెప్పడంలో సందేహమే లేదు . వీళ్ళు కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు .

తెరపై వీళ్ళ కాంబో కాంబినేషన్ ఎంత సెట్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . క్షేమంగా వెళ్లి లాభంగా రండి సినిమా ఇప్పటికి చూసినా కడుపు నొప్పి వచ్చే విధంగా నవ్వుకుంటాము అనడానికి కారణం కోవై సరళ బ్రహ్మానందం కామెడి టైమింగ్ అనే చెప్పాలి . అయితే వీళ్ళ మధ్యలో ఏదో సాగుతుంది అని అప్పట్లో వార్తలు వినిపించాయి . దీంతో కోవై సరళ తన కారణంగా బ్రహ్మానందం మ్యారీడ్ లైఫ్ లో ప్రాబ్లమ్స్ రాకూడదు అని బ్రహ్మానందం తో సినిమాలు చేయడం ఆపేసిందట.

ఈ విషయం తెలుసుకున్న బ్రహ్మానందం స్ట్రైట్ గా ఇంటికెళ్లి మరి వార్నింగ్ ఇచ్చాడట. ఇంకోసారి అలా చేస్తే నీ మొఖం కూడా చూడను.. ఎవరో ఏదో అనుకుంటే నువ్వు అలా చేయడం కరెక్ట్ కాదు అంటూ ఫైర్ అయిపోయారట . ఆ తర్వాత కోవై సరళ నేను చేయని తప్పుకు నేను ఎందుకు బాధపడాలి అంటూ మళ్ళీ ఆయనతో కలిసి నటించడం ప్రారంభించింది. ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న కోవై సరళ మంచి అవకాశాలు వస్తే మళ్లీ తెరపై నటించడానికి సిద్ధం అంటుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news