Newsస్కంద 2: ఏపీ సీఎం కూతుర్ని లేపుకుపోయిన తెలంగాణ సీఎం కొడుకు......

స్కంద 2: ఏపీ సీఎం కూతుర్ని లేపుకుపోయిన తెలంగాణ సీఎం కొడుకు… !

ఏంటి టైటిల్ కాస్త విచిత్రంగా ఉంద‌నుకుంటున్నారా .. ఇది నిజం. స్కంధ సినిమాలో ఏపీ సీఎం, తెలంగాణ సీఎం పాత్ర‌లు ఉంటాయి. ఈ సినిమా స్టార్టింగ్‌లోనే ఏపీ సీఎం కూతురు పెళ్లి త‌న బావ‌మ‌రిదితో జ‌రుగుతూ ఉంటుంది. అయితే ఆ పెళ్లికి వ‌చ్చిన తెలంగాణ సీఎం కొడుకు ఏపీ సీఎం కూతురుని లేపుకుపోతాడు. అక్క‌డ నుంచి రెండు రాష్ట్రాల సీఎం పాత్ర‌ధారుల మ‌ధ్య వార్ మొద‌ల‌వుతుంది.

ఈ వార్‌లోకి హీరో రామ్ ఎంట్రీ ఇస్తాడు. ఇంటర్వెల్ ట్విస్టులో రామ్ రెండు సీఎంల కూతుర్ల‌ను కిడ్నాప్ చేసి త‌న ఊరుకు తీసుకుపోతాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా క్లైమాక్స్‌లో మ‌రో ట్విస్ట్ ఉంటుంది. ఎనర్జీటిక్‌ స్టార్ హీరో రామ్ పోతినేని.. తన కెరీర్ లోనే తొలిసారి మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి చేసిన సినిమా స్కంద శ్రీ లీల హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది.

అయితే ఈ సినిమా క్లైమాక్స్‌లో అదిరిపోయే ట్విస్ట్‌ చోటు చేసుకుంటుంది. అప్పటివరకు సింగల్ రామ్‌ మాత్రమే తెరమీద కనిపిస్తాడు. చివర్లో రెండో హీరోయిన్ సాయి మంజరేకర్ లవర్ గా మరో రామ్ ఎంట్రీ ఇస్తాడు. ఆ రామ్ ఎంట్రీ ఇచ్చాక స్కంద 2 సినిమా ఉంటుందని బోయపాటి క్లారిటీ ఇచ్చాడు. ఇక స్కంద‌ సినిమాలో రామ్ యాక్షన్ ఎమోషన్స్ తో కూడిన ఊర మాస్ అవతారంలో కనిపించాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news