Moviesఅంగరంగ వైభవంగా సౌత్ క్వీన్ త్రిష వివాహం..సైలెంట్ షాక్ ఇచ్చిన చెన్నై...

అంగరంగ వైభవంగా సౌత్ క్వీన్ త్రిష వివాహం..సైలెంట్ షాక్ ఇచ్చిన చెన్నై బ్యూటీ(వీడియో)..!!

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . సౌత్ క్వీన్ త్రిష రహస్యంగా పెళ్లి చేసుకుందా..? అంటే అవుననే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో త్రిష పెళ్లి చాలా ఘనంగా జరిగింది.. వైభవంగా జరిగింది . త్రిష పెళ్లికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇది రియల్ లైఫ్ లో పెళ్లి అనుకుంటే పొరపాటే.. ఆమె ఓ జ్యూవెలరీ యాడ్ కి సంబంధించిన యాడ్లో పెళ్లి చేసుకుంది.

దీంతో అభిమానులు షాక్ అయిపోతున్నారు. ఒక్కసారిగా ఆ వీడియోకి సంబంధించిన క్లిప్స్ చూసి నిజంగానే త్రిష పెళ్లి చేసుకుందేమో అంటూ షాక్ అయిపోయారు . రీసెంట్ గా సౌత్ క్వీన్ త్రిష ప్రముఖ జ్యువెలరీ జీఆర్టీ జువెలర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది . ఈ బ్రాండెడ్ జ్యూవెలరీ ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేస్తుంది . దీనికి సంబంధించి తాజాగా త్రిష ఓ యాడ్ లో నటించింది. ఈ యాడ్ ని చాలా సూపర్ గా చిత్రీకరించారు మేకర్స్ .

ఈ యాడ్ లో త్రిష పెళ్లికూతురులానే కనిపిస్తుంది. పట్టు వస్త్రాలతో ఒంటి నిండా అద్భుతమైన నగలతో చూడచక్కగా ఉంది. ఒక ముక్కలో చెప్పాలంటే రాయల్ లుక్ లో అందరిని ఆకట్టుకునింది త్రిష . నాలుగు పదుల వయసులోనూ పాతికేళ్ళ అమ్మాయిల కనిపించడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి . ఈ యాడ్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఒక్కసారిగా ఈ యాడ్ తాలూకా పిక్స్ చూసిన జనాలు త్రిష చెప్పకుండా పెళ్లి చేసుకున్నావా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు . తీరా మ్యాటర్ తెలుసుకున్నాక కూల్ అవుతున్నారు . దీంతో సోషల్ మీడియాలో త్రిష పెళ్లి వీడియో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news