Moviesనాగార్జున కొత్త సినిమా టైటిల్ చూశారా… ఖ‌చ్చితంగా బొమ్మ సూప‌ర్ హిట్టే..!

నాగార్జున కొత్త సినిమా టైటిల్ చూశారా… ఖ‌చ్చితంగా బొమ్మ సూప‌ర్ హిట్టే..!

సీనియర్ హీరో నాగార్జునకు ఇటీవల కాలంలో సరైన హిట్ లభించలేదు. నాగార్జున బ్లాక్ బస్టర్ సినిమా కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాడు. గతేడాది నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయింది. ఈ సినిమా కోసం నాగార్జున ఎంతో కష్టపడిన ఫలితం మాత్రం అనుకూలంగా రాలేదు. నాగర్జున తన సినిమా కెరియర్లో ఎంతోమంది కొత్త దర్శకులతో పనిచేసి ఎన్నో సూపర్ డూపర్ హిట్లు కొట్టారు.

అలాంటి నాగార్జునకు ఇప్పుడు వరుస ప్లాపులు రావడంతో అభిమానులు కూడా తీవ్ర నిరాశలో ఉన్నారు. ఒకప్పుడు నాగార్జున సినిమాలకు కనీసం మినిమం ఓపెనింగ్స్ కూడా ఉండేవి. అయితే ఇప్పుడు తొలి ఆటకే థియేటర్లో జ‌నాలు ఉండని పరిస్థితి. ఓవైపు సీనియర్ హీరోలు అయిన‌ బాలయ్య, చిరంజీవి తమ సినిమాలతో అద్భుతంగా రాణిస్తున్నారు. దీంతో నాగర్జున కూడా ఒక్క హిట్ కొట్టి తానేంటో నిరూపించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న ఆ హిట్ మాత్రం దక్కటం లేదు.

తాజాగా రచయిత అయిన బెజవాడ ప్రసన్నకుమార్ చెప్పిన కథకు నాగర్జున ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. మలయాళం లో సూపర్ హిట్ అయిన పోరింజు మరియమ్‌ జోష్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. దీనిని తెలుగు నేటివిటీకి అనుకూలంగా ప్రసన్నకుమార్ మార్పులు చేసినట్టు సమాచారం. ఇక ఈ సినిమా టైటిల్ కూడా చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తోంది.

గలాటా అని టైటిల్ చెప్పిన వెంటనే నాగార్జున మెస్మరైజ్ అయ్యాడని.. కథ వినగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ముందు ఈ సినిమాకు ప్రసన్న కుమార్ ని దర్శకుడుగా అనుకున్నా తర్వాత వేరే దర్శకుడు తో ముందుకు వెళ్లాలని చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ సినిమా నాగార్జున కెరీర్ లో 99వ సినిమాగా తెరకెక్కుతోంది. పవర్ఫుల్ యాక్షన్ సెంటిమెంట్తో ఈ సినిమా కథ ఉంటుందని తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news