Moviesప్రభాస్ కోసం అలాంటి రిస్క్ చేస్తున్న శృతి హాసన్.. డార్లింగ్ ఫ్యాన్స్...

ప్రభాస్ కోసం అలాంటి రిస్క్ చేస్తున్న శృతి హాసన్.. డార్లింగ్ ఫ్యాన్స్ ఫిదా..!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టాక ఎలాంటి రోల్స్ నైనా చేయగలగాలి ..ఎలాంటి డైలాగ్స్ నైనా అవలీలగా చెప్పగలగాలి.. అప్పుడే ఒక హీరోయిన్ జనాల్లోకి వెళ్ళగలుగుతుంది. ఆ క్వాలిటీస్ అన్ని ఎక్కువగా ఉన్నాయి కమల్ హాసన్ ముద్దుల కూతురు శృతిహాసన్. ఎస్ శృతిహాసన్ రీసెంట్గా చేసిన పని అభిమానులను ఫిదా చేసింది. మరి ముఖ్యంగా డార్లింగ్ అభిమానులను క్లీన్ బౌల్డ్ చేసి పడేసింది . ప్రెసెంట్ శృతిహాసన్ – ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న సినిమా సల్లార్ లో హీరోయిన్గా చేస్తున్న విషయం తెలిసిందే.

సెప్టెంబర్ 28న ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది . ఈ సినిమా కోసం శృతిహాసన్ బాగానే కష్టపడుతుంది . తెలుగు – తమిళ్ – హిందీ భాషలలో హీరోయిన్ గా చేసిన శృతిహాసన్ ఈ సినిమా కోసం ఏకంగా ఐదు భాషలలో ఆమె డబ్బింగ్ చెప్పుకుంటుందట. అంతేకాదు సినిమా సక్సెస్ అవ్వడానికి శృతిహాసన్ తన వంతు పబ్లిసిటీ పాపులారిటీ కూడా చేస్తుంది. ఇప్పటికే మూడు భాషల్లో డబ్బింగ్ పూర్తి చేసిన శృతిహాసన్.. మిగిలిన రెండు భాషల్లో కూడా డబ్బింగ్ కంప్లీట్ చేసే బిజీ పనిలో ఉందట.

అంతేకాదు తన పర్సనల్ పని పోస్ట్ పోన్ చేసుకుని మరి సినిమా కోసం టైం కేటాయించి డబ్బింగ్ ఫినిష్ చేస్తుందట. దీంతో హీరోయిన్ కి ఉండాల్సిన ప్రధాన లక్షణం ఇదే అని సినిమా కోసం మన పనులను కూడా పక్కన పెట్టాల్సిందేనని .. ఆ విషయంలో శృతిహాసన్ సూపర్ అని జనాలు పొగిడేస్తున్నారు . ఖచ్చితంగా ఈ సినిమా ద్వారా శృతిహాసన్, మరో క్రేజీ హిట్ ను తన ఖాతాలో వేసుకోబోతుంది అని ధీమా వ్యక్తం చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news