Movies"కింద లుంగీ-చింపిరి జుట్టు-నోట్లో బీడీ".. 'నా స్వామి రంగ' నాగార్జున ఎంత...

“కింద లుంగీ-చింపిరి జుట్టు-నోట్లో బీడీ”.. ‘నా స్వామి రంగ’ నాగార్జున ఎంత హాట్ గా ఉన్నాడో(వీడియో)..!!

నేడు సినిమా ఇండస్ట్రీలో అందరికీ ది మోస్ట్ ఫేవరెట్ గా ఉండే అక్కినేని నాగార్జున పుట్టినరోజు . ఈయన పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఆయన ఫ్యాన్స్ ఫ్యామిలీ మెంబర్స్ శ్రేయోభిలాషులు ఆయనకు భారీ ఎత్తున విషెస్ అందిస్తున్నారు . ఈ క్రమంలోనే టాలీవుడ్ కింగ్ మన్మధుడుగా పేరు సంపాదించుకున్న నాగార్జున తన 99వ సినిమాని అనౌన్స్ చేసాడు. 65 దాటేసిన ఇంకా అంతే అందంగా ఆరోగ్యంగా ఉంటూ నాగార్జున కుర్ర హీరోలా కనిపిస్తున్నాడు.

కాగా 98 సినిమాలతో మెప్పించిన నాగ్ వందకు మరో రెండు అడుగుల దూరంలో ఉన్నాడు . ఈ క్రమంలోనే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న 99వ సినిమాని అఫీషియల్ గా ప్రకటించాడు . శ్రీనివాస చిట్టూరి నాగార్జున 99వ సినిమా నిర్మిస్తున్నారు. ఇప్పటికే నాగ్ తన కెరియర్ లో ఎంతోమంది కొత్త డైరెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు . ఇప్పుడు ఈ సినిమాతో మరో కొత్త డైరెక్టర్ని పరిచయం చేస్తున్నారు . విజయ్ బన్నీ అనే కొత్త డైరెక్టర్ నాగార్జున 99వ సినిమాని తెరకెక్కిస్తున్నాడు .

ఈ సినిమాకి “నా స్వామి రంగ” అనే టైటిల్ సైతం ఫిక్స్ చేశారు . కాగా ఈ లుక్స్ లో నాగార్జున కేక పెట్టిస్తున్నారు . అచ్చం శివ టైం లో ఉన్న లుక్స్ లో కనిపిస్తూ యంగ్ హీరోస్ కి సైతం టఫ్ కాంపిటీషన్ ఇచ్చే విధంగా కనిపిస్తున్నాడు . కాగా న ఆయన పుట్టినరోజు సందర్భంగా టైటిల్ తో పాటు చిన్న గ్లిపంస్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. నాగార్జున లుంగీకటి ..బీడీ కాలుస్తూ మాస్ లుక్ లో కనిపించాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . కాగా మొత్తానికి చాలా కాలం తర్వాత నాగర్జున శివ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లాంటి హిట్ను మరోసారి అందుకోబోతున్నాడు అంటూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news