Moviesచ‌వితికి స్పీక‌ర్లు ప‌గిలిపోతాయ్‌... భ‌గ‌వంత్ కేస‌రి దెబ్బ‌తో థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లుతాయ్‌... మోక్ష‌జ్ఞ...

చ‌వితికి స్పీక‌ర్లు ప‌గిలిపోతాయ్‌… భ‌గ‌వంత్ కేస‌రి దెబ్బ‌తో థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లుతాయ్‌… మోక్ష‌జ్ఞ షేకింగ్ ట్వీట్‌..!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ – అనిల్ రావిపూడి కాంబినేష‌న్లో తెర‌కెక్కుతోన్న భ‌గ‌వంత్ కేస‌రి సినిమాపై ఎలాంటి హై అంచ‌నాలు ఉన్నాయో చెప్ప‌క్క‌ర్లేదు. జ‌స్ట్ ఈ సినిమా ఎనౌన్స్ అయిన‌ప్ప‌టి నుంచే సోష‌ల్ మీడియాలో మోత మోగిపోతోంది. బాల‌య్య‌కు జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా… యంగ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల బాల‌య్య కూతురు పాత్ర‌లో క‌నిపించ‌బోతోంద‌ని స‌మాచారం.

షైన్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా ఈ భారీ బ‌డ్జెట్ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ సినిమాకు రు. 95 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగిన‌ట్టుగా తెలుస్తోంది. బాల‌య్య కెరీర్‌లోనే ఇదే హ‌య్య‌స్ట్ ప్రి రిలీజ్ బిజినెస్‌గా స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇక ఈ సినిమా ఫ‌స్ట్ సింగిల్‌పై రెండు మూడు రోజులుగా పుకార్లు బ‌య‌లు దేరాయి.

అయితే ఈ రోజు దీనిపై బాల‌య్య త‌న‌యుడు నంద‌మూరి మోక్ష‌జ్ఞ అప్‌డేట్ ఇవ్వ‌డంతో అస‌లు నంద‌మూరి ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులే లేకుండా పోయాయి. వినాయ‌క చ‌వితికి గ‌ణ‌గ‌ణ గ‌ణేశా అంటూ సాంగ్ రాబోతోంది.. భ‌గ‌వంత్ కేస‌రి ఫ‌స్ట్ సింగిల్ లోడింగ్‌.. చ‌వితి రోజు స్పీక‌ర్లు ప‌గిలిపోతాయ్ అంటూ కామెంట్ చేయ‌డంతో పాటు భ‌గ‌వంత్ కేస‌రి నుంచి బాల‌య్య భూమిలో క‌త్తిదించుతోన్న ఫొటో కూడా షేర్ చేశాడు.

మోక్ష‌జ్ఞ ఇచ్చిన ఈ అప్‌డేట్ అయితే సోష‌ల్ మీడియాలో మామూలుగా స్వింగ్ అవ్వ‌డం లేదు. ఇక చ‌వితి రోజు స్పీక‌ర్లు ప‌గిలిపోతాయ్‌… రేపు సినిమా రిలీజ్ అయ్యాక థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోతాయ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్ల‌తో మెక్ష‌జ్ఞ ట్వీట్ వైర‌ల్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news