Movies' భోళాశంక‌ర్ ' సెన్సార్ రివ్యూ.. ఇన్ని మార్పులా… అస‌లు చిరు...

‘ భోళాశంక‌ర్ ‘ సెన్సార్ రివ్యూ.. ఇన్ని మార్పులా… అస‌లు చిరు సినిమా టాక్ ఏంటి…!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టిస్తోన్న సినిమా భోళాశంక‌ర్‌. ఈ సినిమా రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డింది. ఈ నెల 11న థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. పెద్ద‌గా క‌ట్స్ లేకుండానే యూ / ఏ స‌ర్టిఫికెట్ సొంతం చేసుకుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి మానియాను ఈ నెల 11న థియేట‌ర్ల‌లో చూసేందుకు మ‌నం సిద్ధ‌మైపోవ‌చ్చు.

అయితే సినిమా చూసిన సెన్సార్ స‌భ్యులు మొత్తం నాలుగు క‌రెక్ష‌న్లు చెప్పార‌ట‌. సినిమాలో మ‌ధ్య‌పానం, ధూమ‌పానం యాడ్ టెక్ట్స్ సైజ్ కాస్త పెంచాల‌ని సూచించార‌ట‌. ఇక డ్ర‌గ్స్ వాడ‌కం మీద సూచ‌న‌లు సినిమా మొద‌ట్లో చేయాల‌ని సూచ‌న‌లు చేశార‌ట‌. ఇక ఇంట‌ర్వెల్ ముందు హీరో విల‌న్ తల న‌రుకుతున్న‌ప్పుడు ఆ విజిబులిటీ త‌గ్గించాల‌ని సూచించార‌ట‌.

అలాగే బ‌ద్దలు, బాసింగాలు అనే ప‌దం డ‌బ్బింగ్ నుంచే కాదు స‌బ్ టైటిల్స్ నుంచి కూడా తొల‌గించార‌ట‌. ఇది ప‌క్క‌న పెట్టేస్తే ఇక మెగాస్టార్ ఫ్యాన్స్‌కు అస‌లు కావాల్సింది ఏంటి ? చిరు వింటేజ్ లుక్‌, మెగాస్టార్ స్టైల్ ఆఫ్ కామెడీ, అదిరిపోయే యాక్ష‌న్‌, ఎమోష‌న్‌, గూస్‌బంప్స్ ఇచ్చే ఎలివేష‌న్లు కూడా సినిమాలో బాగానే ఉన్నాయంటున్నారు.

ఇక భోళాశంక‌ర్ టోట‌ల్ ర‌న్ టైం159 నిమిషాలుగా వ‌చ్చింది. వాల్తేరు వీర‌య్య‌తో పాటు ఇటీవ‌ల కాలంలో వ‌స్తోన్న పెద్ద సినిమాల‌తో పోలిస్తే ఇది క్రిస్పీ ర‌న్ టైం అని చెప్పాలి. సినిమాకు జ‌స్ట్ ఓకే టాక్ అయితే సెన్సార్ నుంచి వ‌స్తోంది. మ‌రి రేప‌టి రోజున ఈ శంక‌ర్ థియేట‌ర్ల‌లో ఏం చేస్తాడో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news