Moviesఆ స్టార్ హీరోయిన్ కోసం ప‌బ్లిక్‌గానే కొట్టుకున్న చిరంజీవి - నాగార్జున‌.....

ఆ స్టార్ హీరోయిన్ కోసం ప‌బ్లిక్‌గానే కొట్టుకున్న చిరంజీవి – నాగార్జున‌.. వైర‌ల్ వీడియో ( వీడియో )

ఈ టైటిల్ చూస్తుంటేనే కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. ఓ స్టార్ హీరోయిన్ కోసం నాగార్జున‌, చిరంజీవి కొట్టుకోవ‌డం ఏంటి ? ఇది నిజ‌మేనా ? అసలు ఎవ‌రా హీరోయిన్‌.. వీరిద్ద‌రు ఎక్క‌డ కొట్టుకున్నార‌న్న‌ది ఇంట్ర‌స్టింగ్‌. మామూలుగా నాగార్జున‌, చిరంజీవి ఇద్ద‌రూ బెస్ట్ ఫ్రెండ్స్‌. ఎంత పెద్ద స్టార్లు అయినా కూడా వీరి మ‌ధ్య బ‌య‌ట ఎంతో స్నేహం ఉంటుంది. అలాగే వీరు బ‌య‌ట క‌లిసి వ్యాపారాలు కూడా చేసేవారు

గ‌తంలో చిరు – నాగ్ ఓ ప‌బ్లిక్ ఫంక్ష‌న్లో ర‌మ్య‌కృష్ణ ముందే గొడ‌వ ప‌డ్డారు. అయితే ఇదంతా స‌ర‌దా కోసం. తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఎప్ప‌ట‌కి మ‌ర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదైనా ఉందంటే అది వ‌జ్రోత్స‌వాలు. తెలుగు సినిమా పుట్టి 75 సంవ‌త్స‌రాలు అయిన సంద‌ర్భంగా ఈ వ‌జ్రోత్స‌వాల ఈవెంట్ నిర్వ‌హించారు. ఆ రోజు యాంక‌ర్ సుమ చిరంజీవి, నాగార్జున మ‌ధ్య‌లో కూర్చున్న ర‌మ్య‌కృష్ణ ద‌గ్గ‌ర‌కు వెళ్లి.. మీరు ఈ ఇద్ద‌రు స్టార్ల‌తో నటించారు క‌దా.. వీరిలో ఏ హీరో అంటే మీకు ఇష్టం ? అని ప్ర‌శ్నించింది.

అప్పుడు చిరంజీవి నేనే అని వస్తాడు… నాగార్జున కూడా కాదు నేనంటేనే ఎక్కువ ఇష్టం అని సుమ మైక్ ముందుకు వ‌స్తాడు. నాతో ర‌మ్య ఎక్కువ సినిమాలు చేసింద‌ని నాగార్జున అంటే… నాతో చాలా గొప్ప సినిమాలు చేసింద‌ని చిరు స‌మాధానం చెప్తాడు. అలా వాళ్లిద్ద‌రు ర‌మ్య‌కృష్ణ కోసం గొడ‌వ ప‌డుతున్న నాటి వీడియో అలా వైర‌ల్ అవుతూ వ‌స్తోంది. ఈ వీడియెనే మీరు కూడా కింద చూడొచ్చు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news