Movies' బ్రో ' మేకింగ్ వీడియో… ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను అస్స‌లు ఆప‌లేంగా...

‘ బ్రో ‘ మేకింగ్ వీడియో… ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను అస్స‌లు ఆప‌లేంగా ( వీడియో)

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ – సాయిధ‌ర‌మ్ తేజ్ క‌లిసి న‌టించిన సినిమా బ్రో. కేతిక శ‌ర్మ‌, ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ కూడా న‌టించిన ఈ సినిమాకు స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. గ‌త నెల 28న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఫ‌స్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యే స‌రికి బ్రో సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా రు. 108 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌తో పాటు రు. 60 కోట్ల షేర్ కూడా రాబ‌ట్టింది.

ఈ సినిమాలో ప‌వ‌న్ బ్రో అనే దేవుడి పాత్ర‌లో క‌నిపించిన సంగ‌తి తెలిసిందే. స‌క్సెస్ ఫుల్‌గా సెకండ్ వీక్‌లోకి ఎంట‌ర్ అయిన ఈ సినిమా షూటింగ్ టైంలో మేకింగ్ వీడియోను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఈ మేకింగ్ వీడియోలో ప‌వ‌న్ ఎంత‌లా ఎంజాయ్ చేస్తున్నాడో చూస్తుంటూనే అర్థ‌మ‌వుతోంది. ప‌వ‌న్ చాలా ఉత్సాహంగా ఈ సినిమా టీంతో జోకులు వేస్తూ సినిమాలో యాక్ట్ చేసిన‌ట్టు వీడియో చూస్తుంటేనే అర్థ‌మ‌వుతోంది. ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news