Moviesతనికెళ్ళ భరణి చేసిన ఛండాలమైన పని .. చెప్పుతో కొట్టడానికి ఆడవాళ్ళు...

తనికెళ్ళ భరణి చేసిన ఛండాలమైన పని .. చెప్పుతో కొట్టడానికి ఆడవాళ్ళు అక్కడికి కూడా వచ్చారా..? అంత తప్పు ఏం చేశారంటే..!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్న ..స్టార్ నటులు ఉన్న.. తనికెళ్ళ భరణికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . చిన్న – పెద్ద – ఎంగేజ్ – ముసలి వయసులో ఉన్న అందర్నీ అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది ఆయన నటన . దాదాపు 30 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న తనికెళ్ల భరణి.. రైటర్గా తన సినీ ప్రస్ధానాన్ని మొదలుపెట్టారు .

ఆయన రచయిత గా చేసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . అంతేకాదు పాత్రకు జీవం పోసి నటించడం ఆయనలోని స్పెషాలిటీ . దర్శకుడిగా – రచయితగా ఉన్న సినిమాల్లో తన ప్రత్యేకతను చాటుకున్నారు తనికెళ్ల భరణి . ముఖ్యంగా కెరియర్ మొదట్లో ఆయన పాత్రలు చేసి భయంకరమైన లుక్స్ లో మెప్పించారు . అంతేకాదు తెరపై విలన్ అంటే అప్పట్లో అందరికీ తనికెళ్ల భరణి గుర్తు వచ్చేవారు.

క్రూరత్వం ఆయన యాక్టింగ్ లో తాండవించేది . అంతలా పాత్రలో ఇన్వాల్వ్ అయిపోయి నటించారు . ఈ క్రమంలోనే మాతృదేవోభవ సినిమా టైంలో ఆయన విలన్ రోల్ పోషించారు . ఈ సినిమాల్లో ఓ సీన్లో హీరోయిన్ పై దారుణంగా ప్రవర్తిస్తాడు తనికెళ్ల భరణి . అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కొంతమంది మహిళలు ఆయన నిజంగానే అలాంటి క్యారెక్టర్ అనుకోని .. బయట ఎక్కడ కనిపించిన తిట్టేవారట.. చెప్పుతో కొట్టడానికి కూడా వచ్చేవారట . ఈ విషయాన్ని రీసెంట్ ఇంటర్వ్యూలో తనికెళ్ల భరణినే స్వయంగా చెప్పుకు రావడం గమనార్హం. దీంతో తెరపై అంతలా లీనమైపోయి నటించి మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు తనికెళ్ల భరణి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news