Moviesఒక ' ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ ' ముగ్గురు డైరెక్ట‌ర్లు… ఇంకెంత‌మంది వ‌స్తారో…!

ఒక ‘ ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ ‘ ముగ్గురు డైరెక్ట‌ర్లు… ఇంకెంత‌మంది వ‌స్తారో…!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా అంటేనే క‌నీసం ఇద్ద‌రు డైరెక్ట‌ర్లు ఉంటారు. ప‌వ‌న్ మామూలుగానే చేతులు వేళ్లు పెట్టేసి డైరెక్ష‌న్ చేస్తుంటాడు. ఇక డైరెక్ట‌ర్ ఎలాగూ ఉంటాడు. అదే ఇటీవ‌ల ప‌వ‌న్ సినిమాల‌కు త్రివిక్ర‌మ్ కూడా యాడ్ అవుతున్నాడు. ఇక్క‌డ డైరెక్ట‌ర్ + ప‌వ‌న్ + త్రివిక్ర‌మ్ ముగ్గురు డైరెక్ట‌ర్ల కిచిడీగా ఈ సినిమా మారుతోంది.

అయితే త్రివిక్ర‌మ్‌తో సంబంధం లేకుండానే ప‌వ‌న్ ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌, క్రిష్ హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమాలు వ‌స్తున్నాయ‌నుకుంటే ఇప్పుడు ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ కూడా రోజు రోజుకు ర‌క‌ర‌కాలుగా మార్పులు చేర్పుల‌కు గుర‌వుతోన్న ప‌రిస్థితి. ముందుగా కోలీవుడ్ హిట్ మూవీ తెరికి రీమేక్‌గా ఈ సినిమాను తెర‌కెక్కించాల‌నుకున్నారు.

ఇది ఓ ఫక్తు కమర్షియల్ స్టోరీ… అయితే మైత్రీ సంస్థ పవన్ తోనే రీమేక్ చేసేందుకు కందిరీగ‌, ర‌భ‌స‌ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్‌తో చాలా రోజులు వ‌ర్క్ చేయించింది. త‌ర్వాత అత‌డికి కొంత అమౌంట్ ఇచ్చి ఈ ప్రాజెక్టు నుంచి త‌ప్పించార‌ని అంటారు. అయితే ఇప్పుడు అదే స్క్రిఫ్ట్‌లో మార్పులు చేర్పులు చేసి ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌ను తెర‌మీద‌కు తెచ్చార‌ని అంటున్నారు.

అంటే సంతోష్ శ్రీనివాస్ నుంచి మొద‌లు పెట్టి హ‌రీష్‌శంక‌ర్ వ‌ర‌కు వ‌చ్చింది. ఇక ప‌వ‌న్ మార్పులు, చేర్పులు ఎలాగూ ఉంటాయి. అంటే ఉస్తాద్‌కు త్రివిక్ర‌మ్ లేక‌పోయినా ఇప్ప‌టికే ముగ్గురు ద‌ర్శ‌కులు ప‌ని చేసిన‌ట్టే.. ఇక రేప‌టి రోజున సినిమా రిలీజ్ టైంకు ఇంకెంత మంది ద‌ర్శ‌కులు ఈ క‌థ / సినిమాలోకి యాడ్ అవుతారో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news