Moviesవ‌రుణ్ తేజ్ - లావ‌ణ్య మ‌ధ్య చిచ్చు… పెళ్లికి ముందే ఇలా...

వ‌రుణ్ తేజ్ – లావ‌ణ్య మ‌ధ్య చిచ్చు… పెళ్లికి ముందే ఇలా దొరికిపోయాడేంటి..!

మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన గాండీవ ధారి అర్జున సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. తాజాగా హైదరాబాదులో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుక చాలా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాంకర్ సుమ త్వరలో కాబోయే భార్య భర్తలు వరుణ్ తేజ్ – లావణ్య దంపతుల మధ్య చిచ్చు పెట్టింది.

అసలు విషయంలోకి వెళితే ఫ్రీ రిలీజ్ వేడుకలో కాల్ మీ అర్జెంట్ అంటూ నిహారిక – లావణ్య నుంచి ఒకేసారి మెసేజ్ వస్తే మీరు ఎవరికి ? కాల్ చేస్తారు అంటూ వరుణ్ ను ప్రశ్నించింది. దీంతో వరుణ్ ఒక్కసారిగా తల పట్టుకున్నాడు .వెంటనే కాస్త తేరుకుని నిహారిక చిన్నమ్మాయి కాబట్టి తనకి కాల్ చేస్తా అంటూ సమాధానం ఇచ్చాడు.

ఏది ఏమైనా పెళ్లికి ముందే తనకు చెల్లి అంటేనే ఇష్టం అని చెప్పి లావణ్య కు ట్విస్ట్ ఇచ్చాడని.. మొత్తానికి పెళ్ళికి ముందే లావణ్యకు వరుణ్ ఇలా దొరికిపోయాడు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news