Moviesపూజా హెగ్డేపై మ‌హేష్‌కు అంత కోపం ఎందుకు… అంత క‌క్ష ఎందుకు...

పూజా హెగ్డేపై మ‌హేష్‌కు అంత కోపం ఎందుకు… అంత క‌క్ష ఎందుకు క‌ట్టాడు…!

టాలీవుడ్ లో పూజ హెగ్డే చాలామందికి లక్కీ హీరోయిన్. హీరోలు.. నిర్మాతలు మాత్రమే కాదు దర్శకులు కూడా ఆమెను పట్టు పట్టి తమ సినిమాలలో హీరోయిన్గా తీసుకుంటారు. మాటల మంత్రి కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ – హరీష్‌ శంకర్ వీళ్ళ సినిమాలలో పూజ హెగ్డే ఉంటే ఒక సెంటిమెంట్. అలాంటిది ఇప్పుడు ఈ ఇద్దరు దర్శకులు పూజకు హ్యాండ్ ఇచ్చేశారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమాలో పూజ హెగ్డే మెయిన్ హీరోయిన్.

ఇప్పుడు ఆమె ఆ సినిమా నుంచి తప్పుకోవడంతో శ్రీలీల మెయిన్ హీరోయిన్ గా.. మీనాక్షి చౌదరి రెండో హీరోయిన్గా చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమా చేస్తున్నాడు హరీష్ శంకర్. ఇందులో పూజ హెగ్డే హీరోయిన్. అయితే ఇప్పుడు పూజహెగ్డేను ఈ ప్రాజెక్టు నుంచి తప్పించి శ్రీలీల‌ మెయిన్ హీరోయిన్ గా సెకండ్ హీరోయిన్గా ఏజెంట్ భామ సాక్షి వైద్యను తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఇక గుంటూరు కారం సినిమా విషయానికి వస్తే పూజా హెగ్డే తప్పుకోవటానికి దర్శకుడు పై మహేష్ బాబు ఒత్తిడి ప్రధాన కారణం అన్న గుసగుసలు ఇండస్ట్రీ వర్గాలలో ఉన్నాయి. అసలు మహర్షి సినిమా షూటింగ్ జరిగినప్పుడే పూజ వ‌ల్ల‌ మహేష్ బాబు చాలా ఇబ్బంది ప‌డ్డాడ‌ట‌. ఆమె షూటింగ్ కు సరిగా రాకపోవడంతో పాటు.. తనతో పాటు వచ్చే తన టీంకు కూడా అవి ఇవి కావాలంటూ గొంతెమ్మ కోరిక‌లు కోరటం.. ఒక్కోసారి తనకు సరైన వస‌తులు లేవంటూ షూటింగ్ కు డుమ్మా కొట్ట‌డం… ఇలా మహేష్ బాబు కాల్ షీట్లు చాలా వరకు వేస్ట్ చేసింది అన్న చర్చలు అప్పట్లో నడిచాయి.

అసలు గుంటూరు కరం సినిమా విషయంలో మహేష్ కు ఇష్టం లేకపోయినా పూజ హెగ్డేను హీరోయిన్గా తీసుకున్నారు. చివరకు ఈ సినిమా షూటింగ్ రకరకాల కారణాలతో ఆలస్యం అయింది. మ‌హేష్ ఇంట్లో ప‌లు సంఘ‌ట‌న‌లు జ‌ర‌గిన‌ప్పుడు పూజ తాను ఇచ్చిన కాల్షీట్లు వేస్ట్ అయ్యాయ‌ని చాలా కండీష‌న్లు పెట్టింద‌ట‌. ఆ త‌ర్వాత మ‌రికొంత కాలం షూటింగ్ జ‌ర‌గ‌లేదు. చివ‌ర‌కు విసిగిపోయిన మహేష్ కూడా పూజను కావాలని త్రివిక్రమ్ పై ఒత్తిడి చేసి తప్పించినట్టు తెలుస్తోంది. కారణాలు ఏవన్నది పక్కన పెడితే మహేష్ – పవన్ కళ్యాణ్ లాంటి ఇద్దరు పెద్ద హీరోల సినిమాలని పూజ హెగ్డే మిస్ చేసుకుంది. ఇది ఆమె కెరీర్ కు పెద్ద ఎదురుదెబ్బ లాంటిదే అని చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news