Moviesసుశాంత్‌సింగ్ ల‌వ‌ర్ కొత్త ప్రియుడ్ని చూశారా… ఇండియాలోనే డ‌బ్బున్నోడిని ప‌ట్టేసింది..!

సుశాంత్‌సింగ్ ల‌వ‌ర్ కొత్త ప్రియుడ్ని చూశారా… ఇండియాలోనే డ‌బ్బున్నోడిని ప‌ట్టేసింది..!

బాలీవుడ్ నటి రియా చక్రవర్తి ప్రేమ వ్యవహారం మరోసారి హాట్‌ టాపిక్ గా మారింది. దివంగత నటుడు సుశాంత్ రాజపుత్‌తో కొంతకాలం రిలేషన్ లో ఉన్న రియా ఆయన అకాల మరణం తర్వాత తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంది. అంతేకాదు డ్రగ్స్ కేసులో భాగంగా రియాను 2020లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేయడంతో ఆమె నెల రోజులపాటు జైలు జీవితం అనుభవించి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే

కొంత కాలం ఒంటరిగా ఉంటున్న రియా ఇటీవల మరో కొత్త ప్రియుడుతో ప్రేమలో పడి చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతుంది. ఈ విషయం ఇప్పుడు నేషనల్ మీడియాలో హాట్‌ టాపిక్ గా మారింది. రియా చక్రవర్తి కొత్త లవర్ ఎవరో కాదు జీరోధా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌తో ఆమె ప్రేమలో పడినట్టు తెలుస్తుంది.

భారతదేశంలోనే అతిపిన్న‌ వయసు ఉన్న వారిలో నికర విలువ తొమ్మిది వేల‌ కోట్ల ఆస్తి కలిగి ఉన్న వ్యక్తిగా నిఖిల్ గుర్తింపు పొందారు. దీంతో ఇప్పుడు రియా భారతదేశంలోనే అత్యంత ధనవంతుడు అయిన పిన్న వ‌య‌స్కుడిని ప‌ట్టేసి అత‌డితో డేటింగ్, చెట్టా ప‌ట్టాలేసుకుని తిరుగుతోంద‌న్న వార్త నేష‌న‌ల్ వైడ్‌గా హాట్ టాపిక్‌గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news