Moviesఒక న‌గ్మా ఐదు క్రేజీ ఎఫైర్లు… ఆ లిస్టులో ఉన్న హీరోలు.....

ఒక న‌గ్మా ఐదు క్రేజీ ఎఫైర్లు… ఆ లిస్టులో ఉన్న హీరోలు.. సెల‌బ్రిటీలు వీళ్లే…!

ఒకప్పుడు టాలీవుడ్ ను తన అందచందాలతో ఒక ఊపు ఊపేసిన హీరోయిన్ నగ్మా. 48 సంవత్సరాల నగ్మాకు ఇంకా పెళ్లి కాలేదన్న‌ విషయం తెలిసిందే. దాదాపు మూడు దశాబ్దాలుగా నగ్మా తన పెళ్లిని వాయిదా వేస్తూ వస్తోంది. గతంలో పలుమార్లు మీ పెళ్లి ఎప్పుడు ? అని ప్రశ్నిస్తే పెళ్లి చేసుకుని ఏం సాధించాలని రివర్స్‌లో కౌంటర్లు వేసేది. ఆ బంధంలోకి అడుగు పెట్టాలని లేదంటూ కరాకండిగా చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే 50 సంవత్సరాల వయసుకు చేరువ అవుతున్న వేళ నగ్మా తొలిసారిగా పెళ్లిపై చాలా పాజిటివ్గా స్పందించింది.

తనకు పెళ్లి చేసుకోవాలని ఉందని ప్రకటించి షాక్ ఇచ్చింది. తాను పెళ్లి చేసుకోకూడదు అని ఎప్పుడూ అనుకోలేదని అది అలా జరిగిపోయింది అంటూ వ్యాఖ్యానించింది. పెళ్లి చేసుకొని పిల్లలని కనాలని.. కుటుంబంతో కలిసి ఉండాలని తనకు అప్పుడప్పుడు అనిపిస్తుందని.. కాలం కలిసి వస్తే అది జరుగుతుందని తెలిపింది. అయితే నగ్మా పై గతంలో చాలా పుకార్లు వచ్చాయి. ఆమె ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా అయిదారు గురు సెలబ్రిటీలతో ఎఫైర్లు నడిపిందన్న విషయం తెలిసిందే.

ముందుగా కోలీవుడ్ సీనియర్ నటుడు శరత్ కుమార్ తో మొదలుపెట్టిన ఆమె ప్రేమాయణాలు తర్వాత భోజపురి నటులు రవి కిషన్ సింగ్ – మనోజ్ తివారితో కూడా ఆమె కహానీలు నడిపింది. ఇక భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సార‌వ్ గంగూలీతో పీకల‌లోతు ప్రేమలో మునిగిపోయిన ఆమె అతడితో చాలా రోజులు డేటింగ్ కూడా చేసింది. వీరిద్దరూ కలిసి శ్రీకాళహస్తిలో దోష నివారణ పూజలు కూడా చేశారు.

ఇక తెలుగులోనూ ఆమె ఒక సీనియర్ హీరో ప్రేమలో పడింది అని.. అయితే అప్పటికే అతడికి పెళ్లయి పిల్లలు ఉండడంతో ఆ హీరో ఆమెను వాడుకున్నాడు తప్ప పెళ్లి విషయంలో ఓకే చెప్పలేదని.. ఇలా ప్రేమలో పడి పలుమార్లు మోసపోయిన ఆమె తర్వాత చాలా రోజులపాటు పూర్తి ఆధ్యాత్మిక ధోరణిలోకి వెళ్లిపోయిందన్న విషయం కూడా తెలిసిందే. ప్రస్తుతం నగ్మా వయసు 48 సంవత్సరాలు.. ఇప్పుడు ఆమెకు పెళ్లి పై మూడు వచ్చింది. మరి ఆమెకు ఈ లేటు వయసులో దొరికే భర్త ఎవరో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news