Moviesహీరో యాష్-శ్రీలీల బావ-మరదళ్లు ఎలా అవుతారో తెలుసా..? ఏంటి ఈ విధంగా...

హీరో యాష్-శ్రీలీల బావ-మరదళ్లు ఎలా అవుతారో తెలుసా..? ఏంటి ఈ విధంగా కూడా వరసలు కలిపేస్తారా..

సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఈ మధ్యకాలంలో ఏ విషయమైనా ఇట్టే సెకండ్స్ లో ట్రెండింగ్ గా మారిపోతుంది . కాగా గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో టాలీవుడ్ యంగ్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ శ్రీ లీల ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోకి మరదలు అవుతుందనే విషయం వైరల్ గా మారింది. టాలీవుడ్ ని తన అంద చందాలతో ఏలేస్తున్న యంగ్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం ఎంత బిజీగా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

దాదాపు చేతిలో 12 సినిమాలకు పైగానే పెట్టుకుని ఉన్న ఈ బ్యూటీ మహేష్ బాబు సరసన గుంటూరు కారం , బాలయ్య నటిస్తున్న భగవంత్ కేసరి, పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్.. రామ్ నటిస్తున్న స్కంద వంటి భారీ చిత్రాలలో భాగమైంది . ఈ క్రమంలోనే ఆమెకు సంబంధించిన ఏ న్యూస్ అయినా సరే ఇట్టే సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . కాగా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోకి శ్రీలీల మరదలు అవుతుందనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ హీరో మరెవరో కాదు కన్నడ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న “యాష్”.

వీళ్లు నిజమైన బంధువులు కాదు ..బ్లడ్ రిలేషన్ అసలే లేదు.. కానీ యాష్ కుటుంబంతో శ్రీలీల ఫ్యామిలీకి చాలా మంచి అనుబంధం ఉంది . యాష్ భార్య రాధిక పండిట్ కు డెలివరీ చేసింది శ్రీ లీల తల్లి గారే . శ్రీలీల తల్లి స్వర్ణలత బెంగళూరులో ఉన్న పెద్ద గైనకాలజిస్ట్ . ఆమెకు ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయో తెలిసిందే. అయితే యాష్ భార్య రాధికా పండిట్ కు రెండుసార్లు ప్రెగ్నెన్సీ రాగా.. రెండుసార్లు కూడా స్వర్ణలతనే డెలివరీ చేశారు. ఈ క్రమంలోనే యాస్ష్ – రాధిక.. స్వర్ణలతకు ఫ్యామిలీ మెంబర్ల కలిసిపోయారు .

అంతేకాదు తన రాధికను స్వర్ణలత తన కూతురిలా చూసుకుంటుందట . ఈ క్రమంలోనే శ్రీ లీల – స్వర్ణలతను అక్క అక్క అంటూ పిలుస్తుందట . అయితే ఈ రకంగా చూసుకుంటే శ్రీ లీలకు రాధిక భర్త యాష్ బావ అవుతాడుగా . అప్పుడు శ్రీలీల మరదలు అవుతుందిగా అంటూ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news